Rayapati Aruna : జ‌గ‌న్‌తో పాటు స‌జ్జ‌ల‌కి గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన రాయ‌పాటి అరుణ‌

Rayapati Aruna : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేసిన విష‌యం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై జగన్ సెటైర్లు వేశారు. మహిళలంటే పవన్ కళ్యాణ్ కు గౌరవం లేదని జగన్ మండిపడ్డారు. లోక‌ల్, నేష‌న‌ల్, ఇంటర్నేష‌న‌ల్ అంటూ దారుణ‌మైన కామెంట్స్ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై జ‌గ‌న్ చేసిన కామెంట్స్ కి ఆయ‌న అభిమానులు, మ‌ద్దతు దారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే జ‌గ‌న్ చేసిన కామెంట్స్‌పై స‌జ్జ‌ల స్పందించారు. ముఖ్యమంత్రి ప్రస్తవించిన అంశాల్లో పవన్ కళ్యాణ్‌పై చెప్పిన వాటిల్లో అవాస్తవాలు ఉన్నాయా.. ఒక సారి పబ్లిక్ లైవ్ లోకి వచ్చాక ప్రశ్నించొచ్చు.

ఆదర్శప్రాయుడు కాకపోతే ప్రజలకు సరైన రోల్ మోడల్ కాదని భావిస్తాం. ఒక వేళ ఆదర్శప్రాయుడు కాపోతే పబ్లిక్ లో కనపడకుండా ఉండాలి. అయితే అది కాకుండా మహ పీఠాధిపతి తరహాలో సమాజం గురించి చెపితే ఎలా. పవన్ కళ్యాణ్ అంటున్నది కరెక్టే చట్టప్రకారం విడాకులు తప్పేంలేదు. అయితే అవి వరుసగా మూడు జరిగితే ఏం లోపం…. వాళ్లల్లోనా, మీలోనా, మీ ఆలోచనల్లో లోపమా అనే అనుమానం మీ చుట్టూ ఉన్నవాళ్లకు వస్తుంది. పవన్ కళ్యాణ్ అందరికి సందేశాలు ఇస్తున్నప్పుడు ప్రజలే అడుగుతారు.” అని సజ్జల అన్నారు. జగన్ వచ్చేసరికి ఇళ్లేందుకు కట్టుకున్నారు… ఇక్కడి నుంచి ఎందుకు ఆపరేట్ చేస్తున్నారు. జగన్ కు రాష్ట్రం మీద సీరియస్ నెస్ ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇళ్లు హైదారాబాద్‌లో కట్టుకుంటారా. ఎలా అయినా బ్రిటిష్‌ వాళ్లు దోచుకున్నట్టు దోచుకుని హైదారాబాద్ కు పట్టుకెళ్లాలని చూస్తున్నారు. చంద్రబాబు రాజకీయాల్లో ఏ రకంగానూ అర్హుడు కాదు అంటూ స‌జ్జ‌ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Rayapati Aruna strong warning to sajjala ramakrishna reddy
Rayapati Aruna

అయితే జ‌గ‌న్, స‌జ్జ‌ల చేసిన కామెంట్స్ పై జ‌న‌సేన‌కి చెందిన రాయ‌పాటి అరుణ స్పందించారు. కూలంకుషంగా స‌ల‌హాలు అందించేవారు స‌ల‌హాదార‌ని చెప్పిన రాయ‌పాటి స‌జ్జ‌ల గురించి మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెళ్లి విష‌యంలో మాట్లాడు మాట్లాడు అని స‌ల‌హాలు ఇచ్చి అది వ‌ర్క‌వుట్ కావ‌ట్లేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కి ఒక సల‌హా ఇచ్చారు. అది ఏంటంటే.. ఒక‌టి క‌న్నా ఎక్కువ సంబంధ బాంధ‌వ్యాలు ఉంటే గుట్టుగా సీక్రెట్‌గా చేసుకోవాల‌ని అన్నారు. లీగ‌ల్ గా చేసుకుంటే త‌ప్ప‌ని అన్నారు. మ‌రి స‌జ్జ‌ల ఈ కామెంట్స్‌తో ఏం చెప్పాల‌ని అనుకున్నారో అర్ధం కావ‌డం లేదంటూ గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసింది అరుణ‌.లీగ‌ల్గా పెళ్లి చేసుకోవ‌డం త‌ప్పు. గుట్టుగా ఎన్నైన చేసుకోవ‌చ్చ‌ని స‌జ్జ‌ల‌గారు స‌ల‌హా ఇచ్చార‌ని అరుణ పేర్కొంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago