Rayapati Aruna : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై జగన్ సెటైర్లు వేశారు. మహిళలంటే పవన్ కళ్యాణ్ కు గౌరవం లేదని జగన్ మండిపడ్డారు. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్‌పై జగన్ చేసిన కామెంట్స్ కి ఆయన అభిమానులు, మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జగన్ చేసిన కామెంట్స్‌పై సజ్జల స్పందించారు. ముఖ్యమంత్రి ప్రస్తవించిన అంశాల్లో పవన్ కళ్యాణ్‌పై చెప్పిన వాటిల్లో అవాస్తవాలు ఉన్నాయా.. ఒక సారి పబ్లిక్ లైవ్ లోకి వచ్చాక ప్రశ్నించొచ్చు.
ఆదర్శప్రాయుడు కాకపోతే ప్రజలకు సరైన రోల్ మోడల్ కాదని భావిస్తాం. ఒక వేళ ఆదర్శప్రాయుడు కాపోతే పబ్లిక్ లో కనపడకుండా ఉండాలి. అయితే అది కాకుండా మహ పీఠాధిపతి తరహాలో సమాజం గురించి చెపితే ఎలా. పవన్ కళ్యాణ్ అంటున్నది కరెక్టే చట్టప్రకారం విడాకులు తప్పేంలేదు. అయితే అవి వరుసగా మూడు జరిగితే ఏం లోపం…. వాళ్లల్లోనా, మీలోనా, మీ ఆలోచనల్లో లోపమా అనే అనుమానం మీ చుట్టూ ఉన్నవాళ్లకు వస్తుంది. పవన్ కళ్యాణ్ అందరికి సందేశాలు ఇస్తున్నప్పుడు ప్రజలే అడుగుతారు.” అని సజ్జల అన్నారు. జగన్ వచ్చేసరికి ఇళ్లేందుకు కట్టుకున్నారు… ఇక్కడి నుంచి ఎందుకు ఆపరేట్ చేస్తున్నారు. జగన్ కు రాష్ట్రం మీద సీరియస్ నెస్ ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇళ్లు హైదారాబాద్‌లో కట్టుకుంటారా. ఎలా అయినా బ్రిటిష్ వాళ్లు దోచుకున్నట్టు దోచుకుని హైదారాబాద్ కు పట్టుకెళ్లాలని చూస్తున్నారు. చంద్రబాబు రాజకీయాల్లో ఏ రకంగానూ అర్హుడు కాదు అంటూ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే జగన్, సజ్జల చేసిన కామెంట్స్ పై జనసేనకి చెందిన రాయపాటి అరుణ స్పందించారు. కూలంకుషంగా సలహాలు అందించేవారు సలహాదారని చెప్పిన రాయపాటి సజ్జల గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పెళ్లి విషయంలో మాట్లాడు మాట్లాడు అని సలహాలు ఇచ్చి అది వర్కవుట్ కావట్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక సలహా ఇచ్చారు. అది ఏంటంటే.. ఒకటి కన్నా ఎక్కువ సంబంధ బాంధవ్యాలు ఉంటే గుట్టుగా సీక్రెట్‌గా చేసుకోవాలని అన్నారు. లీగల్ గా చేసుకుంటే తప్పని అన్నారు. మరి సజ్జల ఈ కామెంట్స్‌తో ఏం చెప్పాలని అనుకున్నారో అర్ధం కావడం లేదంటూ గట్టిగా ఇచ్చి పడేసింది అరుణ.లీగల్గా పెళ్లి చేసుకోవడం తప్పు. గుట్టుగా ఎన్నైన చేసుకోవచ్చని సజ్జలగారు సలహా ఇచ్చారని అరుణ పేర్కొంది.