Ravi Krishna : ఇటీవలి కాలంలో వరుస తెలుగు సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. బలగం సినిమా ఎంతటి పేరు ప్రఖ్యాతలు సాధించిందో మనం చూశాం.ఇప్పుడు విరూపాక్ష కూడా మంచి హిట్ కొట్టింది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో బుల్లితెర నటుడు రవికృష్ణ సైతం ఎమోషనల్ అయ్యారు.బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ నటుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమంలో కూడా తెగ హడావిడి చేశారు.ప్రస్తుతం పలు సీరియల్స్ చేస్తున్న రవికృష్ణ విరూపాక్షలో మంచి పాత్ర చేశాడు.
మొదటిసారి విరూపాక్ష సినిమా ద్వారా వెండితెర సినిమా అవకాశాలను అందుకున్న రవి కృష్ణ తన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఈయన పాత్రకు ఎంతో మంచి స్పందన రావడంతో ఒక్కసారిగా ఈయన ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా మంచి హిట్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ క్రమంలోనే రవికృష్ణ తన పాత్ర గురించి తన పాత్రకు వస్తున్న స్పందన గురించి మాట్లాడుతూ తడబడటమే కాకుండా కన్నీళ్లు పెట్టుకున్నారు.తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ దండుకు ఈ సందర్భంగా రవికృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు.
తన పాత్రతో పాటు ఇతరుల పాత్రలు కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరించే విధంగా ఉన్నాయని సాయిధరమ్ తేజ్ చెప్పారు. అయితే రవికృష్ణ పాత్రకి ఇంత క్రేజ్ దక్కడంతో ఆయన ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ప్రస్తుతం రవికృష్ణకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక సాయిధరమ్ తేజ్ కి ఈ సినిమా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి ప్రమాదం తర్వాత ఆయన నటించిన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో అభిమానులు కూడా ఎంతోసంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…