Ravi Babu : పూర్ణ‌తో రిలేష‌న్ షిప్‌పై ఎట్ట‌కేలకు స్పందించిన ర‌విబాబు.. ఆయ‌న ఏమ‌న్నారంటే..!

Ravi Babu : జాన‌ర్ ఏదైన ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచే ద‌ర్శ‌కుల‌లో ర‌విబాబు ఒక‌రు. ఆయ‌న అ అనే అక్ష‌రంతో ఎక్కువ సినిమాలు తెర‌కెక్కించారు. అవి అన్నీ మంచి విజ‌యాలే సాధించాయి. తాజాగా రవిబాబు కథనందిస్తూ.. వన్ ఆఫ్ ది లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం అసలు . ఏప్రిల్ 13 నుండి ఈ చిత్రం ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో మరోసారి పూర్ణ లీడ్ రోల్‌లో నటిస్తోంది. రవిబాబు డైరెక్షన్‌లో వచ్చిన అవును చిత్రం పూర్ణకు హీరోయిన్‌గా మంచి బ్రేక్ ఇవ్వ‌గా రవిబాబు, పూర్ణ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతూ వస్తోంది.

రవిబాబు డైరెక్ట్‌ చేసిన అవును 2, లడ్డూబాబు చిత్రాల్లో కూడా పూర్ణ లీడ్ రోల్స్‌ లో మెరిసింది. దీంతో ఈ ఇద్దరి మధ్య లవ్‌ ఎఫైర్‌ నడుస్తుందంటూ పుకార్లు షికారు చేశాయి. ఈ క్ర‌మంలో అస‌లు ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్న ర‌విబాబు ఆ వార్త‌ల‌పై స్పందించాడు. ర‌విబాబు మాట్లాడుతూ పూర్ణతో ఎఫైర్‌ మాట వాస్తవమే అంటూ షాకిచ్చాడు. `పూర్ణతో నాకు లవ్‌ ఎఫైర్‌ ఉంద`న్నారు. అయితే అక్కడే పెద్ద ట్విస్ట్ పెట్టాడు. ఎఫైర్‌ అంటే మరో విధంగా అనుకోవద్దని, ప్రతి దర్శకుడికి నటులతో అలాంటి అనుబంధాన్నే కలిగి ఉంటాడని తెలిపారు. అయితే ఇలాంటి అనుబంధం ఉండటమే వల్లే నటులతో మంచి నటన రాబట్టుకోగలుగుతామని, వారు మంచి ఔట్‌పుట్‌ ఇస్తారనేది రవిబాబు మ‌న‌సులో మాటగా అర్ధ‌మ‌వుతుంది.

Ravi Babu finally told about his relationship with poorna
Ravi Babu

పూర్ణ గురించి చెబుతూ, దర్శకుడు చెప్పేదాన్ని పూర్ణ.. రెండు వందల శాతం బెస్ట్ ఇస్తుందని వెల్లడించారు. ఆమె ప్రొఫేషనల్‌ యాక్టర్ అని తెలిపారు. తమ కాంబినేషన్‌లో నాలుగు సినిమాలొచ్చాయని, సహజంగా ఎక్కువ సినిమాలు చేయడంతో ఇలాంటి ఎఫైర్లు వార్తలు ఎక్కువ‌గా వినిపిస్తుంటాయి కాని అందులో నిజం లేద‌ని ర‌విబాబు అన్నాడు. ఇటీవల నా కొత్త సినిమా ‘వాషింగ్ మెషీన్’ కోసం పూర్ణాను సంప్రదించాం. తనకు నచ్చకపోవడంతో నిర్మొహమాటంగా నో చెప్పింది. తాను ఆ పాత్రకు సరిపోతాను అనుకుంటేనే నటిస్తుంది. నా కోసం అంగీకరించదు అని ర‌విబాబు స్పష్టం చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago