Ravi Babu : జానర్ ఏదైన ప్రేక్షకులకి మంచి వినోదం పంచే దర్శకులలో రవిబాబు ఒకరు. ఆయన అ అనే అక్షరంతో ఎక్కువ సినిమాలు తెరకెక్కించారు. అవి అన్నీ మంచి విజయాలే సాధించాయి. తాజాగా రవిబాబు కథనందిస్తూ.. వన్ ఆఫ్ ది లీడ్ రోల్‌లో నటించిన చిత్రం అసలు . ఏప్రిల్ 13 నుండి ఈ చిత్రం ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో మరోసారి పూర్ణ లీడ్ రోల్‌లో నటిస్తోంది. రవిబాబు డైరెక్షన్‌లో వచ్చిన అవును చిత్రం పూర్ణకు హీరోయిన్‌గా మంచి బ్రేక్ ఇవ్వగా రవిబాబు, పూర్ణ కాంబినేషన్ రిపీట్ అవుతూ వస్తోంది.
రవిబాబు డైరెక్ట్ చేసిన అవును 2, లడ్డూబాబు చిత్రాల్లో కూడా పూర్ణ లీడ్ రోల్స్ లో మెరిసింది. దీంతో ఈ ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందంటూ పుకార్లు షికారు చేశాయి. ఈ క్రమంలో అసలు ప్రమోషన్స్ లో పాల్గొన్న రవిబాబు ఆ వార్తలపై స్పందించాడు. రవిబాబు మాట్లాడుతూ పూర్ణతో ఎఫైర్ మాట వాస్తవమే అంటూ షాకిచ్చాడు. `పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉంద`న్నారు. అయితే అక్కడే పెద్ద ట్విస్ట్ పెట్టాడు. ఎఫైర్ అంటే మరో విధంగా అనుకోవద్దని, ప్రతి దర్శకుడికి నటులతో అలాంటి అనుబంధాన్నే కలిగి ఉంటాడని తెలిపారు. అయితే ఇలాంటి అనుబంధం ఉండటమే వల్లే నటులతో మంచి నటన రాబట్టుకోగలుగుతామని, వారు మంచి ఔట్‌పుట్ ఇస్తారనేది రవిబాబు మనసులో మాటగా అర్ధమవుతుంది.
పూర్ణ గురించి చెబుతూ, దర్శకుడు చెప్పేదాన్ని పూర్ణ.. రెండు వందల శాతం బెస్ట్ ఇస్తుందని వెల్లడించారు. ఆమె ప్రొఫేషనల్ యాక్టర్ అని తెలిపారు. తమ కాంబినేషన్‌లో నాలుగు సినిమాలొచ్చాయని, సహజంగా ఎక్కువ సినిమాలు చేయడంతో ఇలాంటి ఎఫైర్లు వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి కాని అందులో నిజం లేదని రవిబాబు అన్నాడు. ఇటీవల నా కొత్త సినిమా ‘వాషింగ్ మెషీన్’ కోసం పూర్ణాను సంప్రదించాం. తనకు నచ్చకపోవడంతో నిర్మొహమాటంగా నో చెప్పింది. తాను ఆ పాత్రకు సరిపోతాను అనుకుంటేనే నటిస్తుంది. నా కోసం అంగీకరించదు అని రవిబాబు స్పష్టం చేశారు.