Pooja Hegde : పూజా హెగ్డే.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగింది. అందం, అభినయంతో పాటు మంచి టాలెంట్ ఉన్న పూజా ఇప్పుడు బాలీవుడ్‌లోను అదరగొడుతుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ బిజీగా అయ్యింది. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాతో బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకోబోతున్న పూజాహెగ్డే… సల్మాన్‌ఖాన్‌తో రీమేక్ సినిమాలో యాక్ట్ చేస్తూ ముంబైలో హల్‌చల్ చేస్తోంది. సల్మాన్‌ఖాన్‌తో నటించిన సినిమా కావడంతో ప్రమోషన్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన పూజాహెగ్డే ..సోషల్ మీడియాలో కూడా అంతకు మించి యాక్టివ్‌గా ఉంటుంది.
వెరైటీ డ్రెస్సులో అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తున్న పూజా హెగ్డే రీసెంట్‌గా వెరైటీ డ్రెస్సులో వారెవ్వా అనిపిస్తుంది. ఓ విచిత్రమైన ప్యాంట్ ధరించిన పూజా హెగ్డే ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. పూజా హెగ్డే ధరించిన ప్యాంట్ చాలా వదులుగా ఉంది. దీనితో నెటిజన్లు ఆమెపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. నీ సైజు ప్యాంట్ దొరకలేదా, గోనె సంచి లాంటి ప్యాంట్ వేసుకున్నావు ఏంటి అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయినప్పటికీ ఈ డ్రెస్ లో పూజా హెగ్డే స్టైలిష్ గా కనిపిస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ బుట్ట బొమ్మ ఆకర్షిస్తోంది. రీసెంట్‌గా ఆరంజ్ కలర్ ఫుల్ లెంగ్త్ డ్రెస్‌లో పూజాహెగ్డే అందాలు ఆరబోసింది. ఫాలోవర్స్‌కి పిచ్చెక్కిస్తోంది.
పూజా హెగ్డే అందాలకి నెటిజన్స్ దాసోహం అంటున్నారు. ఇక పూజాహెగ్డే సినిమాలు ఫ్లాప్ అయినా ..అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. రీసెంట్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అమ్మడు అక్కడ కూడా వరుస సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోల పక్కన జోడి కడుతోంది. సౌత్‌లో అమ్మడికి గత రెండేళ్లగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఎంత పెద్ద హీరో పక్కన యాక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అవడంతో మకాం ముంబైకి మార్చేసింది. అక్కడే డిఫరెంట్ క్రేజీ ప్రాజెక్టులు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. సోషల్ మీడియాలోను అప్పుడప్పుడు సందడి చేస్తుంది.