Madhavi Latha : టాలీవుడ్ హీరోయిన్ మాధవి లత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాలతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మాధవీ లత ఇటీవల పెద్దగా అవకాశాలు రాక వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తుంది. తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినీ పరిశ్రమలో తనకు ఎదురైన విచిత్ర పరిస్థితుల గురించి మాట్లాడిన మాధవీ లత.. నేను ఎవరిని బాధ పెట్టే రకం కాదు.
టెంపర్ కోల్పోతే మాత్రం.. ఎదురుగా ఎవరు ఉన్నారు అనేది చూడను. ఎవరైనా నిర్మాతనో.. మరో వ్యక్తో నాతో తప్పుగా మాట్లాడితే.. అప్పుడు అరవను. వారి మాటల వల్ల ఎంత కోపం వచ్చినా సరే.. శాంతంగానే బదులిస్తాను. నేను మీరు అనుకునే మనిషిని కాదండని చెప్పి వెళ్లి పోతాను అని చెప్పుకొచ్చింది మాధవీ లత. ముందు రోజు.. వస్తావా.. అని తేడాగా మాట్లాడిన వాళ్లే.. మరుసటి రోజు నుంచి నన్ను అమ్మ అని పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో నాకు మైగ్రేన్ సమస్య ఉంది. అనుభవించేవారికే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అందుకే నేను ఎప్పుడు టాబ్లెట్స్ వేసుకునేదాన్ని. అయితే ప్రేమ సినిమాలో రేవతి కూడా అలా మింగడం వలన ఆమె మీద ఏ మందులు పని చేయవు.
అది చూసి నా భవిష్యత్ కూడా ఇలానే ఉంటుందా అని భయమేసింది. అందుకే ఆ రోజు నాకు కూడా ఏ టాబ్లెట్ పని చేయదేమోనని పోస్ట్ పెట్టేసి పడుకున్నాను, తెల్లారి లేచి చూసే సరికి మీడియాలో నేను చనిపోబోతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. నా బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేసి చెప్పడం వలన ఆ విషయం నాకు తెలిసింది. లాక్‌డౌన్ కంటే ముందే నాకు డిప్రెషన్ వచ్చేసింది. అప్పుడు అదింకా ఎక్కువైంది. ఒకానొక సమయంలో చచ్చిపోవాలనిపించింది. కానీ నేను ఆ పని చేయలేదు. . ఎలాంటి ఆత్మహత్య ప్రయత్నాలు చేయను అంటూ మాధవీ లత స్టన్నింగ్ వ్యాఖ్యలు చేసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…