Ravanasura : మాస్ మహరాజా రవితేజ నటించిన తాజా చిత్రం రావణాసుర. ఇందులో రవితేజ విలన్‌గా, హీరోగా అదరగొట్టాడు. ఇందులో ఏకంగా ఐదుగరు హీరోయిన్స్ నటించడం విశేషం. అయితే ఈ సినిమాలోని ఓ డైలాగ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రావణాసుర చిత్రంలో రవితేజ క్యారెక్టర్ నెగెటివ్ ఉండడంతో ఇందులో వైలెన్స్, అడల్ట్ కంటెంట్ పాళ్ళు ఎక్కువగానే ఉన్నాయి. రావణాసుర చిత్రానికి సెన్సార్ సభ్యులు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రవితేజ రావణాసుర మూవీలో ఎంత బీభత్సం చేసాడనేంది.
శాంపిల్ గా రావణాసుర మూవీ చిత్రం నుండి రిలీజ్‌కి ముందే చిన్న డైలాగ్ లీకైంది. మూవీలోని ఓ క్లిప్ వైరల్ గా మారింది. లీక్డ్ వీడియోలో రవితేజ ‘కంచం ముందుకి మంచం మీదకి ఆడపిల్లలు పిలవంగానే రావాలి. లేకపోతే నాకు మండుద్ది రా’ అని ఒక అమ్మాయితో కోపంగా అంటాడు. ఈ డైలాగ్ ఆడవాళ్లను కించ పరిచే విధంగా ఉందని పలువురు అభ్యంతరం చెబుతున్నారు. సెన్సార్ సభ్యులు ఇలాంటి బూతు డైలాగ్ కి ఎందుకు కట్ చెప్పలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . సదరు డైలాగ్ సినిమా నుండి తొలగించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు.
రావణాసుర సినిమా చూసిన సెన్సార్ బోర్డు ఏకంగా 30 కట్స్ చెప్పడం.. దానికి చిత్ర యూనిట్ విభేదించడం.. సెన్సార్ చెప్పిన కట్స్‌కి ఒప్పుకోకపోవడంతో చివరికి ‘A’ సర్టిఫికేట్ జారీ చేశారనే టాక్ కూడా నడిచింది. సుధీర్ వర్మ రావణాసుర చిత్రాన్ని తెరకెక్కించగా, ఈ మూవీలో దక్ష నాగార్కర్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానియేల్, మేఘా ఆకాష్ హీరోయిన్స్ నటిస్తున్నారు. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.. రావణాసుర ఓ బెంగాలీ మూవీ రీమేక్ అని ప్రచారం కాగా.. దర్శకుడు సుధీర్ వర్మ ఖండించారు.