Ravanasura : మాస్ మహరాజా రవితేజ నటించిన తాజా చిత్రం రావణాసుర. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు సుధీర్‌వర్మ దర్శకత్వం వహించగా, చిత్రంలో రవితేజకు జోడీగా ఐదుగురు హీరోయిన్లు నటించారు. హీరోయిన్ పాత్రల్లో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించాడు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ దక్కించుకుంది. ఈసినిమాలో రవితేజ క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపించగా, కొన్ని కారణాల వల్ల ఆ లాయర్ క్రిమినల్‌గా ఎలా మారాడనే పాయింట్‌తో దర్శకుడు సుధీర్‌వర్మ ఈ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాడు.
కంప్లీట్ నెగెటివ్ షేడ్స్‌తో రవితేజ క్యారెక్టరైజేషన్ చిత్రంలో కొత్తగా ఉంది. ఇప్పటివరకు సిల్వర్‌స్క్రీన్ పై ఎప్పుడూ చూడనికొత్త రవితేజను రావణాసురలో చూస్తాం. సుశాంత్ రోల్ యావరేజ్ గా ఉంది. క్రైమ్ సీక్వెన్స్‌లు బాగానే వచ్చాయి. ఇంటర్వెల్ సీన్ అద్భుతంగా ఉండగా, కొత్త పాత్రలో రవితేజ అలరిస్తాడు.సెకండాఫ్‌టిస్టుల సూపర్‌గా ఉన్నాయి. క్లైమాక్స్‌లో బీజీఎం మాత్రం అదిరిపోయింది. ఇక సినిమా క్లైమాక్స్ స్ట్రాంగ్‌గా ఉంది. లాయర్ క్రిమినల్ అయితే ఎలా ఉంటుందో మన మాస్ మహారాజా తనదైన స్టైల్లో చూపించి అదరగొట్టాడు.
ఫస్ట్ హాఫ్ లో రవితేజ శైలి కామెడీ టైమింగ్, హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్‌లతో దర్శకుడు కొంత టైమ్‌పాస్ చేశాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఈ సినిమాకు హైలైట్ . సెకండఫ్ మొత్తం ప్రతి పది నిమిషాలకో ట్విస్ట్ వచ్చి ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తాడు దర్శకుడు. రవితేజ క్యారెక్టర్‌కు సంబంధించి హర్షవర్ధన్ రామేశ్వర్ ఇచ్చిన బీజీఎమ్ బాగుందని ఫ్యాన్స్‌కి విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. అయితే మధ్యలో కొంత నిప్పు, ఖిలాడీ సినిమాలు చూస్తున్నట్టే ఉంటుంది. కొన్ని కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకులకి బోర్ తెప్పిస్తాయి. మొత్తంగా సినిమా రవితేజ అభిమానులకి పిచ్చెక్కించేలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.