Ram Gopal Varma : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసే పనులు, మాట్లాడే మాటలు సెన్సేషన్ అవుతుంటాయి. నలుగురు నడిచిన దారిలో ఆయన నడవరు.తనకు నచ్చినట్టు తాను బ్రతికేస్తుండడం వర్మ స్పెషాలిటీ. ఒకప్పుడు దేశం గర్వించదగ్గ సినిమాలు చేసిన వర్మ ఇప్పుడు మాత్రం కాంట్రవర్సీతో వార్తలలో నిలుస్తున్నాడు. కాగా ఏప్రిల్ 7న రామ్ గోపాల్ వర్మ బర్త్ డే. ఆయన అభిమానులు ఆయన్ని విష్ చేయాలని ఉత్సాహంగా ఉన్నారు. వారి ఆశల మీద వర్మ ఒక్కసారిగా నీళ్లు చల్లాడు.
మీ పనికిమాలిన బర్త్ డే విషెస్ నాకు అవసరం లేదన్నట్లు తన సోషల్ మీడియాలో ఓ కామెంట్ పోస్ట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ కామెంట్ కచ్చితంగా ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. తన కామెంట్‌లో వర్మ ఇలా రాసాడు. రేపు నా పుట్టినరోజు. ఎవరూ నాకు శుభాకాంక్షలు చెప్పొద్దు. మీ ఉచిత శుభాకాంక్షలు నాకు అస్సలు అవసరం లేదు. ఛీప్ గిఫ్ట్స్ తో నేను హ్యాపీ. ఉచిత శుభాకాంక్షలు కంటే కూడా చీప్ గిఫ్ట్స్ బెటర్ కదా… అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వర్మ ట్వీట్ వైరల్ అవుతుంది. సరే మహా ప్రభో మీకు శుభాకాంక్షలు చెప్పమంటూ కొందరు ఆయన ట్వీట్ కి కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో కూడా వర్మ తన పుట్టినరోజు మీద ఇదే తరహా కామెంట్స్ చేశాడు. పుట్టడం పెద్ద విషయమా? ప్రతి నిమిషం ప్రపంచంలో ఎవడో ఒకడు, ఎక్కడో ఒక చోట పుడతాడు. మనిషి పుట్టుకకు ఆడా మగా కలిస్తే చాలు అదేమైనా ఘనకార్యమా? అంటూ తనదైన శైలిలో ఫిలాసఫీ చెబుతూ హాట్ టాపిక్ అయ్యాడు. అయితే తాజాగా వర్మ చేసిన కామెంట్‌ని స్వాగతించి ఎవరు విషెస్ చెప్పకుండా ఉంటారా, లేదంటే తమ అభిమానాన్ని చాటుకునేందుకు విషెస్ చెబుతారా అనేది చూడాలి.