Ravanasura : రావ‌ణాసుర‌.. ఎన్ని కోట్ల న‌ష్టం వ‌చ్చిందో తెలుసా..?

Ravanasura : మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ ప‌రిస్థితి ఇటీవ‌ల దారుణంగా మారింది. ఒక స‌క్సెస్ వ‌స్తే రెండు ఫ్లాపులు అన్న చందంగా మారింది. తనకు హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేదని, ప్రతి సినిమాకు ఒకేలా పనిచేస్తానంటూ దాదాపు హీరోలంతా స్టేట్ మెంట్స్ ఇస్తుండ‌గా, ర‌వితేజ మాత్రం ప‌క్కా ఫాలో అవుతూ ఉంటాడు. ఇటీవ‌లి కాలంలో రవితేజకు అప్పుడప్పుడు హిట్స్ వస్తుంటాయి, చాలాసార్లు ఫ్లాపులే వస్తుంటాయి. అయితే ఈమధ్య కాలంలో అతడు వరుసపెట్టి హిట్స్ ఇచ్చాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు హిట్ కాగా, ఇదే జోష్‌లో రావణాసుర సినిమా కూడా హిట్ అవుతుందని, హ్యాట్రిక్ కొట్టేస్తామంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు.

‘హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్’ అంటూ మేకర్స్ పోస్టర్లు వేసుకున్నారు కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. రిలీజైన తర్వాత మొదటి సోమవారం ఏ సినిమా రిజల్ట్ అయినా తేలిపోతుంది. రావణాసుర సినిమా రిజల్ట్ కూడా నిన్నటి సోమవారంతో ఓ క్లారిటీ వ‌చ్చింది. ఏ ఏరియాలో చెప్పుకోదగ్గ స్థాయిలో షేర్లు రాలేదు. ట్రేడ్ మాటల్లో చెప్పాలంటే, మూవీ ఫ్లాప్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో ఈ సినిమా 14.80 కోట్ల గ్రాస్ .. 8.82 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 18. 90 కోట్ల గ్రాస్ .. 10.54 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధించాలంటే ఇంకా 13 కోట్లను రాబట్టవలసి ఉంటుంది.

Ravanasura do you know how many crores loss
Ravanasura

ఇక ఫీట్ ను సాధించడం కష్టమేననేది విశ్లేషకుల మాట. రావ‌ణాసుర చిత్రంలో ర‌వితేజ నెగెటివ్ షేడ్స్ కలిసిన ఈ పాత్రలో రవితేజ బాగానే చేసినప్పటికీ, ఆడియన్స్ ఆయనను అలా చూడాలనుకోకపోవడం వలన, రిజల్ట్ పరంగా దెబ్బకొట్టేసింది. అభిమానులంతా కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. క్రాక్ లాంటి సక్సెస్ తర్వాత వరుసగా 2 ఫ్లాప్స్ ఇచ్చాడు ర‌వితేజ‌. అంతకంటే ముందు రాజా ది గ్రేట్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసపెట్టి 4 ఫ్లాపులు ఇచ్చాడు. ఇంకాస్త వెనక్కు వెళ్తే, ఓ సక్సెస్ తర్వాత వరుసగా అరడజను ఫ్లాపులిచ్చిన ట్రాక్ రికార్డ్ కూడా ర‌వితేజకి ఉంది. త‌ర్వాతి చిత్రం అయిన హిట్ కొడ‌తాడా చూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago