Ravanasura : మాస్ మహరాజా రవితేజ పరిస్థితి ఇటీవల దారుణంగా మారింది. ఒక సక్సెస్ వస్తే రెండు ఫ్లాపులు అన్న చందంగా మారింది. తనకు హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేదని, ప్రతి సినిమాకు ఒకేలా పనిచేస్తానంటూ దాదాపు హీరోలంతా స్టేట్ మెంట్స్ ఇస్తుండగా, రవితేజ మాత్రం పక్కా ఫాలో అవుతూ ఉంటాడు. ఇటీవలి కాలంలో రవితేజకు అప్పుడప్పుడు హిట్స్ వస్తుంటాయి, చాలాసార్లు ఫ్లాపులే వస్తుంటాయి. అయితే ఈమధ్య కాలంలో అతడు వరుసపెట్టి హిట్స్ ఇచ్చాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు హిట్ కాగా, ఇదే జోష్‌లో రావణాసుర సినిమా కూడా హిట్ అవుతుందని, హ్యాట్రిక్ కొట్టేస్తామంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు.
‘హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్’ అంటూ మేకర్స్ పోస్టర్లు వేసుకున్నారు కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. రిలీజైన తర్వాత మొదటి సోమవారం ఏ సినిమా రిజల్ట్ అయినా తేలిపోతుంది. రావణాసుర సినిమా రిజల్ట్ కూడా నిన్నటి సోమవారంతో ఓ క్లారిటీ వచ్చింది. ఏ ఏరియాలో చెప్పుకోదగ్గ స్థాయిలో షేర్లు రాలేదు. ట్రేడ్ మాటల్లో చెప్పాలంటే, మూవీ ఫ్లాప్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో ఈ సినిమా 14.80 కోట్ల గ్రాస్ .. 8.82 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 18. 90 కోట్ల గ్రాస్ .. 10.54 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధించాలంటే ఇంకా 13 కోట్లను రాబట్టవలసి ఉంటుంది.
ఇక ఫీట్ ను సాధించడం కష్టమేననేది విశ్లేషకుల మాట. రావణాసుర చిత్రంలో రవితేజ నెగెటివ్ షేడ్స్ కలిసిన ఈ పాత్రలో రవితేజ బాగానే చేసినప్పటికీ, ఆడియన్స్ ఆయనను అలా చూడాలనుకోకపోవడం వలన, రిజల్ట్ పరంగా దెబ్బకొట్టేసింది. అభిమానులంతా కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. క్రాక్ లాంటి సక్సెస్ తర్వాత వరుసగా 2 ఫ్లాప్స్ ఇచ్చాడు రవితేజ. అంతకంటే ముందు రాజా ది గ్రేట్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసపెట్టి 4 ఫ్లాపులు ఇచ్చాడు. ఇంకాస్త వెనక్కు వెళ్తే, ఓ సక్సెస్ తర్వాత వరుసగా అరడజను ఫ్లాపులిచ్చిన ట్రాక్ రికార్డ్ కూడా రవితేజకి ఉంది. తర్వాతి చిత్రం అయిన హిట్ కొడతాడా చూడాలి.