Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల రిలేషన్ గురించి చాలా కాలం నుండి పుకార్లు షికార్లు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. చాలా సందర్భాల్లో వాళ్లిద్దరూ కలిసి కనిపించడం కూడా జరిగింది. అయితే తమ మధ్య అలాంటి సంబంధం లేదని తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమే అని ఇంతకాలం పుకార్లను కొట్టి పారేస్తూ వచ్చారు. అయితే ఈ మధ్య వాళ్లిద్దరూ ఒకరి తరువాత ఒకరు కొంత గ్యాప్ తీసుకొని ముంబయి ఎయిర్ పోర్టులో కనిపించడంతో ఇప్పటికే నడుస్తున్న ఊహాగానాలకు మరింత బలాన్ని ఇచ్చినట్లు అయ్యిందని అంటున్నారు. వాళ్లిద్దరూ కలిసి మాల్దీవులకు విహారానికి వెళ్లారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి.
అయితే మాల్దీవుల యాత్రలో ఉన్న రష్మిక స్విమ్మింగ్ పూల్ పక్కన కూలింగ్ గ్లాసెస్ పెట్లుకొని ఉన్న ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కానీ రష్మిక ధరించిన కళ్లజోడు సరిగ్గా ఇదివరకు విజయ్ ధరించిన వాటినే పోలి ఉండడంతో అభిమానులు వారిద్దరూ కలిసే ఉన్నారని ఊహాగానాలు చేయడం మొదలుపెట్టేశారు. వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అనడానికి ఇదే సాక్ష్యం అని చూపిస్తున్నారు. మీడియాలో కూడా వాళ్లిద్దరూ ఒకే రకమైన కళ్లజోడు ధరించిన ఫోటోలను చూపిస్తూ ఈ విషయాన్ని ధృవ పరుస్తున్నారు.
మరోవైపు సోషల్ మీడియాలో కొందరు అభిమానులు వాళ్లిద్దరి కలయికను #virosh అనే హ్యష్ ట్యాగ్ తో వైరల్ చేస్తున్నారు. ఇంతకాలం చక్కర్లు కొడుతున్న ఊహాగానాలు నిజమే అని సంబరాలు చేసుకుంటున్నారు. ఇక దీనిపై విజయ్, రష్మికలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…