Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని స్వతహాగా మృదు స్వభావి అంటుంటారు. సినీ ఇండస్ట్రీలో ఇలా చాలా తక్కువ మంది ఉంటారు. ఎలాంటి కష్టం వచ్చినా ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శల దాడి చేసినా ఆయన ఎప్పుడూ తన హుందా తనాన్ని కోల్పోలేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన అదే విధంగా ఉన్నారు. ఎప్పుడూ ఎవరి పట్ల కటువుగా ఉన్న సందర్భాలు చాలా అరుదు. కానీ తాజాగా జరిగిన గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో ఆయన తన సహనాన్ని కోల్పోయినట్లుగా కనిపించింది. ఈ క్రమంలోనే ఆయన మీడియాపై విరుచుకు పడ్డారు. తన సహజమైన గుణానికి భిన్నంగా ఎప్పుడూ వాడని పదాలను వాడి తనలోని మరో కోణాన్ని చూపించారు. దీంతో అక్కడున్న మీడియా ప్రతినిధులు అవాక్కైపోయారు. అంతటితో ఆగకుండా చిరంజీవి ఇలా మాట్లాడడానికి గల కారణాలను వెతకడం మొదలు పెట్టేశారు.
అయితే గాడ్ ఫాదర్ విడుదలకు ముందు ఆ సినిమా ప్రమోషన్లు సరిగా చేయడం లేదని ప్రచారం చేయడం, అందువల్లనే చిత్రానికి అంతగా హైప్ క్రియేట్ అవడం లేదని సోషల్ మీడియా అలాగే కొన్ని వార్తా వెబ్ సైట్లలో రాయడం మీడియాపై మెగాస్టార్ కోపానికి దారి తీశాయని అనుకుంటున్నారు. తమకి గానీ నిర్మాతలకి గానీ సినిమా ప్రమోషన్ చేయడం తెలీదా అన్నట్టుగా కొందరు మీడియా వాళ్లు న్యూసెన్స్ చేయడం తమను డిస్టర్బ్ చేసిందని చిరంజీవి ఈ సందర్భంగా అన్నారు. కానీ గాడ్ ఫాదర్ సినిమాకు మంచి రేటింగ్ లు ఇవ్వడం పట్ల మళ్ళీ ఆయనే మీడియాను పొగడడం కొసమెరుపు.
అయితే ప్రమోషన్లు సరిగా లేవని మీడియా ప్రచారం కారణంగా కొందరు డిస్ట్రిబ్యూటర్లు చిరంజీవిని కలిసి ప్రచారం లేకపోతే సినిమాకు బజ్ క్రియేట్ అవ్వదని దాంతో మంచి ఓపెనింగ్స్ రావడం కష్టంగా మారుతుందని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఆయనకు చిరాకు తెప్పించాయని టాక్ నడుస్తోంది. ఒకవైపు ఆచార్య డిజాస్టర్ పై కామెంట్లు, మరోవైపు గాడ్ ఫాదర్ ప్రమోషన్లపై అసత్యపు పుకార్లు, ఇంకోవైపు గరికపాటి వివాదం ఇలా అన్నీ కలసి చిరు తన టెంపర్ ను కోల్పోయేలా చేశాయని అంటున్నారు. ఏదైతేనేం గాడ్ ఫాదర్ ఘన విజయంతో మళ్లీ అన్నీ సమసిపోతాయని సినీ వర్గాల అభిప్రాయంగా తెలుస్తోంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…