Abbas : సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఒక్కోసారి జీవితాలు తలకిందులు అవుతుంటాయి. సినీ పరిశ్రమలో అడుగు పెట్టి.. తమదైన శైలి సృష్టించుకుని స్టార్ నటీనటులుగా ఎదుగుతారు. అయితే హిట్ ఫ్లాప్ లను, ఒత్తిడిని, పరాజయాన్ని అన్నింటినీ తట్టుకుంటూ.. కెరీర్ ను కొనసాగించే వారు కొందరు అయితే మరి కొందరు ఎగసి పడిన కెరటంలా.. తమకు వచ్చిన ఫేమ్ ని, అభిమానాన్ని తక్కువ సమయంలో కోల్పోయి.. కెరీర్ ను, సంపాదనను తమ జీవితాన్ని అయోమయంలో పడేసుకుంటారు. 90ల్లో అబ్బాస్ పేరు అంటే అమ్మాయిలు పడి చచ్చిపోయేవాళ్లు. అప్పటి వరకు అరవింద్ స్వామి అందగాడు అంటే ప్రేమ దేశం సినిమాతో అబ్బాస్ వచ్చాడు.
1996లో అబ్బాస్ నటించిన ప్రేమ దేశం విడుదలై రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఈ సినిమా స్పెషల్ షోలు వేయించుకుని కలిసి చూశారు. అప్పట్లో దర్శక నిర్మాతలు సైతం సినిమాల కోసం అబ్బాస్ ఇంటికి క్యూ కట్టారు. దాంతో రెండేళ్లకు సరిపడా సినిమాలకు అబ్బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ స్టార్ ఇమేజ్ వచ్చిన అబ్బాస్ రెండో సినిమాకే పతనం అవ్వడం మొదలయింది. కథలను వినకుండా డబ్బుకోసం వచ్చిన ఆఫర్లన్నింటికీ ఓకే చెప్పడంతో అబ్బాస్ పరిస్థితి దారుణంగా మారింది.
శంకర్ జీన్స్ కథతో అబ్బాస్ వద్దకు రాగా డేట్స్ ఖాళీగా లేవని నో చెప్పాడు. మరికొన్ని సినిమాలను కూడా అబ్బాస్ మిస్ చేసుకున్నాడు. చివరికి సినిమాల్లో చిన్న పాత్రలు.. సీరియల్స్ చేయడం మొదలు పెట్టాడు. అవమానాలు భరించలేక ఓ డిజైనర్ ను పెళ్లి చేసుకుని స్విట్జర్లాండ్ కు వెళ్లిపోయాడు. తెలుగులో అనేక సినిమాల్లో నటించిన అబ్బాస్ కెరీర్ చాలా తక్కువ సమయంలోనే ముగిసిపోయింది. తనకున్న టాలెంట్ ను సరిగ్గా వినియోగించుకోలేక సినిమాల నుంచి సైడ్ అయిపోయాడు. మొదట్లో పెట్రోల్ బంక్ లో పనిచేశాడు. తర్వాత భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పనిచేశాడు. అప్పుడే అక్కడ కనస్ట్రక్షన్ పనిపై పూర్తిగా పట్టు సంపాదించాడు. మెల్లగా బిల్డర్ గా మారాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…