Rishabh Pant : బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ల మధ్య వివాదం చాలా మందికి తెలిసే ఉంటుంది. క్రికెట్, సోషల్ మీడియాలను ఫాలో అయ్యే వారికి వీరిద్దరి గురించి పరిచయం అవసరంలేదు. గతంలో వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ కూడా చేశారు. అది కూడా అతి కొద్ది రోజులు మాత్రమే సాగింది. ఆ తరువాత వీరిద్దరూ బద్ద శత్రువులుగా మారిపోయారు. చాలా సందర్భాల్లో వీరిద్దరి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం కూడా నడిచింది. అయితే తాజాగా ఊర్వశి తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ తో వీరి వివాదం మరొక్కసారి తెరమీదికి వచ్చింది. క్రికెట్ అభిమానులు తనని దారుణంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.
ఊర్వశి ఇన్ స్టాగ్రామ్ లో తను ఫ్లైట్ లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తన హృదయాన్ని ఫాలో అయితే అది తనను ఆస్ట్రేలియాకి తీసుకొచ్చిందని రాసింది. ఇది సోషల్ మీడియాలో దుమారానికి దారి తీసింది. ఆమెకు రిషబ్ తో ఉన్న సంబంధంపై చర్చకు ఊతం ఇచ్చినట్టుగా అయ్యింది. ఇలా ఆమె ఆస్ట్రేలియాకి వచ్చినట్టుగా తెలపగానే నెటిజనులు వివిధ రకాలుగా స్పందించడం మొదలు పెట్టారు. రిషబ్ ను ఆమె ఫాలో చేస్తుందని ట్రోల్ చేస్తున్నారు. రిషబ్ వెంటబడడం ఆపాలని, ఆమె అతన్ని వదలదని, నువ్వు నిజంగా రిషబ్ కోసం వచ్చావా అనీ.. ఇలా వివిధ రకాలుగా ఊర్వశీని కామెంట్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా వచ్చే వారం నుండి మొదలు కానున్న పురుషుల టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు టీమిండియా అక్టోబర్ 7న ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. ఈ క్రమంలో టీమిండియా కొన్ని ప్రాక్టీస్ మ్యాచులను కూడా ఆడనుంది. అయితే అక్కడి పరిస్థితులకు అలవాటు పడడానికి గాను అందరికంటే కాస్త ముందుగానే టీమిండియా ఆస్ట్రేలియా చేరుకుందని తెలిసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…