Rashmika Mandanna : కూర్గ్ భామ రష్మిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. శాండల్ వుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇటీవల నార్త్ సినిమాలు చేస్తూ అక్కడ కూడా తన సత్తా చాటుతోంది. అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమాతో రష్మిక మందన్నాకు దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కింది.. ‘ఛలో’ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మికకు తొలి చిత్రంతో మంచి విజయం దక్కింది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుని సత్తా చాటింది ఈ గ్లామరస్ బ్యూటి.
ఛలో తర్వాత విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న నటించిన ‘గీత గోవిందం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ పలకరించాయి.. సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’, ‘పుష్ప’, ‘సీతా రామం’, ‘వారసుడు’ వంటి భారీ హిట్లను సొంతం చేసుకోవడంతో మరింత పాపులర్ అయింది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ సత్తా చాటుతున్న కన్నడ చందమామ అమితాబ్ బచ్చన్ గుడ్ బై, సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను సినిమాలతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనూ నటించి ఆకట్టుకుంది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మాత్రం దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది రష్మిక. ఆ చిత్రంతో రష్మిక పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ దక్కించుకుంది.
తాజాగా రష్మిక.. తన ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. నేను పెళ్లి చేసుకున్న వ్యక్తితో సెక్యూర్ గా ఫీల్ అవ్వాలి. కంఫర్ట్ గా అన్ని విషయాలు తనతో షేర్ చేసుకోగలగాలి. అతను నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. అతను నా వృత్తిని గౌరవించాలి. అటాంటి వాడే నాకు మంచి లైఫ్ పార్టనర్ అంటూ రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మరి అలాంటి అలాంటి వాడే తనకు లైఫ్ పార్ట్నర్‌గా దొరుకుతాడో లేదొ చూడాలి అంటూ ఈ భామ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ అమ్మడు ఇటీవల విజయ్ దేవరకొండ డేటింగ్ విషయాలతో వార్తలలో నిలుస్తూ వస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…