ఫొటోలో ఉన్న ఇద్ద‌రు హీరోలు ఇప్పుడు స్టార్ హీరోస్.. క‌నుక్కోండి చూద్దాం..

సోష‌ల్ మీడియాలో ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీల చిన్న‌నాటి పిక్స్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ దగ్గర్నుంచి.. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ వ‌ర‌కు వారి చిన్న‌ప్ప‌టి పిక్స్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. సాధార‌ణంగా సినీ ప్రియులు సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త జీవితం గురించి తెలుసుకునేందుకు తెగ ఆస‌క్తి చూపుతుంటారు. ఆ క్ర‌మంలోనే తాజాగా ఓ ఇద్దరు స్టార్ హీరోస్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు వైరలవుతుంది. ఈ పిక్‌లో చూస్తే ఇందులో మ‌న‌కు క‌నిపిస్తున్న వారు బావబామ్మర్దులు.. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోస్.

సెలబ్రెటీస్ ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టిన హీరోగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ ఇద్ద‌రు హీరోలు. చిన్నప్పటి ఫోటోలు ఇప్పటి ఫోటోలు పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తుంటే అసలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. ఆ ఇద్దరు ఎవరో కాదు దగ్గుపాటి రానా, అక్కినేని నాగచైతన్య ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. రానా మేనత్త దగ్గుబాటి శ్రీలక్ష్మిని ముందుగా నాగచైతన్య తండ్రి స్టార్ హీరో నాగార్జున పెళ్లి చేసుకోగా, అనంతరం మనస్పర్ధలు రావ‌డంతో విడిపోయారు. అయితే రానా నాగచైతన్య వరుసకు బావబామ్మర్దులు అవుతారు.

daggubati rana and naga chaitanya childhood photos viral

అక్కినేని నాగార్జున నటవారసుడిగా జోష్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన చైతూ.. తొలి సినిమాతోనే ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్ గా అంతగా హిట్ అవ్వకపోయినా.. నటనపరంగా మాత్రం మెప్పించాడు. ప్రస్తుతం కస్టడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటిస్తుడంగా.. మే 12న తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదల కాబోతుంది.ఇక రానా విష‌యానికి వ‌స్తే లీడ‌ర్ చిత్రంతో ప‌ల‌క‌రించాడు. బాహుబ‌లిలో భ‌ళ్లాల‌దేవ‌గా అద‌ర‌గొట్టాడు. భల్లాల దేవ పాత్రలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో అదరగొట్టాడు రానా. చివరిసారిగా విరాటపర్వం సినిమాలో కనిపించిన రానా.. ఇటీవల తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago