టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా పలు ఇండస్ట్రీలలో స్టార్ హీరోలందరితో కలిసి నటించి స్టార్ స్టేటస్ అందుకున్న అందాల భామ జయప్రద. సాంప్రదాయ పాత్రలైనా.. గ్లామరస్ రోల్ అయినా.. అద్భుతంగా నటించడంలో జయప్రద సిద్ధహస్తురాలు. ఒకప్పుడు స్టార్ హీరోలు అందరితో జతకట్టిన ఆమె, ఆ తర్వాత రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతూ వస్తున్నారు. చాలా కాలంగా రాజకీయాలలో బిజీగా ఉంటున్న ఆమె సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా జయప్రద చిన్ననాటి పిక్ ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ఇందులో జయప్రద ఎంత క్యూట్‌గా ఉంది. ఇప్పుడే కాదు చిన్నప్పుడు కూడా చాలా అందంగా ఉందని నెటిజన్స కామెంట్స్ చేస్తున్నారు.
14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఈమెను చూసి సినిమాల్లోకి తీసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చాక ఆమె పేరుని జయప్రదగా మార్చుకున్నారు. 1976లో విడుదలైన భూమి కోసం అనే సినిమాతో మొదలైన ఆమె ప్రస్థానం 2005వరకు దాదాపు మూడు దశాబ్దాల వరకు సాగింది. తెలుగుతోపాటు.. కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీలో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించింది. పాత్ర ఏదైనా.. అందులో ఒదిగి నటించడమే ఆమెకు తెలుసు. తెరపై ఆమె కనబడినపుడు పాత్ర కనబడుతుంది కానీ నటి కనిపించదు. ఆమెను చూడగానే ఒక అంతులేని కథ, సిరిసిరిమువ్వ, సాగర సంగమం లాంటి కుటుంబ కథా చిత్రాలు ప్రేక్షకుల కళ్ల ముందు కదలాడుతుంటాయి.
అడవిరాముడు, ఊరికి మొనగాడు లాంటి మాస్ చిత్రాల్లో నటించి మెప్పించింది జయప్రద. సీతా కల్యాణం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం లాంటి పౌరాణిక పాత్రలతో సీత , పద్మావతిగా ప్రేక్షకాభిమానం పొందింది. సింహాసనం, రాజపుత్ర రహస్యం వంటి జానపద చిత్రాల్లో రాజకుమారిగా అభిమానుల మందార మాలలు అందుకుంది. జయప్రద అసలు పేరు లలితా రాణి. 1962 ఏప్రిల్ 3న రాజమండ్రిలో జన్మించింది. చిన్నప్పుడే తల్లి తండ్రుల ప్రోత్సాహంతో సంగీతం, నృత్యంలో శిక్షణ తీసుకుంది జయప్రద.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…