Rashmika Mandanna : రష్మిక ఎందుకు అంతలా బాధ పడుతోంది.. అసలు కాంతారాకు, ఆమెకు సంబంధం ఏంటి..?

Rashmika Mandanna : కిరిక్ పార్టీ అనే క‌న్నడ చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసిన ర‌ష్మిక మంద‌న్న‌.. టాలీవుడ్ లోకి ఛ‌లో సినిమాతో అడుగు పెట్టింది. ఆ సినిమా హిట్ కావ‌టంతో పాటు గీత గోవిందం బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. అనంతరం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇటీవల పుష్పతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఓ వైపు ద‌క్షిణాది సినిమాల‌తో పాటు బాలీవుడ్‌లోనూ ర‌ష్మిక క్రేజీ సినిమాల్లో నటిస్తుంది. అయితే ఈమె వ్య‌క్తిగ‌త జీవితంలోనూ కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ర‌క్షిత్ శెట్టితో నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన‌ప్పుడు స‌ద‌రు హీరో ఫ్యాన్స్ ర‌ష్మిక‌ను తెగ ట్రోల్ చేశారు. త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో డేటింగ్ చేస్తుందంటూ కూడా వార్త‌లు వ‌చ్చిన్న‌ప్పుడు కూడా ర‌ష్మిక ట్రోలింగ్‌ను ఫేస్ చేసింది.

ఇప్పటివరకు ట్రోల్స్ భరించిన రష్మిక.. తాజాగా తన మనసులోని బాధను సుధీర్ఘ నోట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. గడిచిన కొన్ని రోజులు, వారాలు, నెలలు లేదా సంవత్సరాలుగా విషయాలు కొన్ని నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వాటికి ముగింపు చెప్పాలని అనుకుంటున్నాను. నిజానికి ఈ ప‌నిని ఎప్పుడో చేయాల్సింది. కాస్త లేట్ అయ్యింది. నేను న‌టిగా కెరీర్ ప్రారంభం చేసిన‌ప్ప‌టి నుంచి కొంద‌రు నన్ను ద్వేషిస్తున్నారు. కొంద‌రైతే దారుణంగా ట్రోలింగ్ చేశారు. వారి చ‌ర్య‌లు ఇప్ప‌టికీ న‌న్ను ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌టం లేదు. మీరంద‌రూ గ‌ర్వ‌ప‌డేలా న‌టించాల‌నే అడుగులు వేస్తున్నాను.

Rashmika Mandanna sad why is concern about kantara movie
Rashmika Mandanna

అయితే ఇలాంటి ట్రోల్స్ అడుగ‌డుగునా అడ్డుప‌డుతుంటే అనుకున్న ల‌క్ష్యాన్ని ఎలా సాధిస్తాను అని ఓ లెట‌ర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక. ఇప్పుడా లెట‌ర్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఇప్పుడు దానికి కాంతార సినిమానే కారణమనే మాట వినిపిస్తోంది. తాజాగా విమానశ్రయంలో కనిపించిన రష్మికకు.. కాంతార సినిమా చూశారా అని రిపోర్టర్ల నుంచి ప్రశ్న ఎదురైంది. చూడలేదు, త్వరలో చూస్తాను అని ఆమె సమాధానమిచ్చింది. దీంతో ఆమెపై కన్నడ నెటిజన్లు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. స్టార్ హీరోయిన్ అయిపోయేసరికి ఆమె మూలాలు మర్చిపోయిందని, ప్రపంచం మెచ్చిన కాంతారని ఆమె చూడకపోవడం ఏంటి? అని మరోసారి రచ్చ రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago