Ashu Reddy : అషూరెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ యాంకర్ గా ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత గ్లామర్ విందు ఇస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 3 లో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపి అక్కడ మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
అదే క్రేజీతో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ కార్యక్రమంలో కూడా పాల్గొంది. అషూరెడ్డి బోల్డ్ గా మాట్లాడటమే కాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్ కూడా కొన్నిసార్లు బోల్డ్ గా పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా అషూరెడ్డి పెట్టిన ఇమేజెస్ కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడమే కాకుండా.. ట్రోలింగ్‌కి కూడా గురవుతున్నాయి. అలాంటి వారికి అషూ తాజాగా ఓ రీల్ రూపంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దేశముదురు సినిమాలో రమాప్రభ చెప్పిన కామాతురాణం డైలాగ్‌ని రీల్ చేసి తన ఖాతాలో పోస్ట్ చేసింది.
కామా తురాణం, నభయం, నలజ్జ.. కామంతో కళ్లు మూసుకుపోయిన వెధవకి సిగ్గు, లజ్జ, భయం, భక్తి ఏమీ ఉండవు అని చెప్పుకొచ్చింది. డైలాగ్ దేశముదురు సినిమాలోది అయినప్పటికీ ఉద్దేశం మాత్రం అషూరెడ్డిదే అర్థమైపోయింది. అంతేకాకుండా ఆ రీల్‌కి క్యాప్షన్ కూడా జత చేసింది. నా ప్రొఫైల్ లో కామెంట్ చేసే కొందరికి దీనిని అంకితం చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ రీల్‌కి కూడా నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. కొందరైతే ముందు నీకు అవన్నీ ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మాకు అవన్నీ లేవు.. మేము ఎప్పుడో వదిలేశాం అంటూ కామెంట్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…