Rashmika Mandanna On Kantara : కాంతార వివాదంపై స్పందించిన ర‌ష్మిక‌.. ఘాటు కామెంట్స్ చేసిన ముద్దుగుమ్మ‌..

Rashmika Mandanna On Kantara : త‌న సొంత టాలెంట్‌తో నేష‌న‌ల్ క్ర‌ష్‌గా పేరు తెచ్చుకున్న‌ర‌ష్మిక తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల‌లోను మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఇటీవ‌ల ర‌ష్మిక‌పై దారుణ‌మైన విమ‌ర్శ‌లు ఎక్కువ అవుతున్నాయి. హీరోయిన్‌గా ఎదిగిన తరవాత రష్మికకు గర్వం, అహంకారం ఎక్కువయ్యాయని.. సొంత పరిశ్రమను ఆమె పరిచిపోయిందని కొంద‌రు విమర్శలు ,చేస్తున్నారు. కన్నడ ప్రేక్షకులు కొందరు ఆమెపై పనిగట్టుకుని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ‘కాంతార’ సినిమా విషయంలో రష్మికను ఎక్కువగా ట్రోల్ చేయ‌డంతో ఈ వివాదంతో పాటు ఇతర వివాదాలపై రష్మిక మందన తాజాగా స్పందించారు.

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన తాజా చిత్రం కాంతార. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం కూడా వహించ‌డంతో ఈ సినిమా చూసిన వారంతా… రిషబ్ శెట్టి నటనకు ఫిదా అయ్యారు. టాలీవుడ్ నుంచి కోలీవుడ్,బాలీవుడ్ వరకు సెలబ్రిటీలంతా కాంతార సినిమాతో పాటు రిషబ్ శెట్టి నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. కాని ర‌ష్మిక మాత్రం కాస్త వెరైటీగా స్పందించింది. రష్మిక మొదటి సినిమా… కిరాక్ పార్టీ కాగా, రక్షిత్ శెట్టి హీరోగా… రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ద్వారానే రష్మిక హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. కొద్ది రోజుల క్రితం ఓ ప్రైవేట్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటిగా తన ప్రస్థానం గురించి వివరించిన రష్మిక … తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన సంస్థ పేరు చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు.

Rashmika Mandanna On Kantara know what she said
Rashmika Mandanna On Kantara

ఈ క్ర‌మంలోనే కన్నడ ప్రేక్షకులతో పాటు అక్కడి పరిశ్రమకు చెందిన కొందరు రష్మిక మందన్న మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆమెను కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్‌ చేయాలని సోషల్‌మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్ర‌మంలో స్పందించిన ర‌ష్మిక‌….‘‘కాంతార విడుదలైన రెండు మూడు రోజుల్లో నన్ను చూశారా అని అడిగారు. అప్పటికి నేను చూడలేదు. త‌ర్వాత నేను చూసి టీమ్‌కి మెసేజ్ కూడా పెట్టాను. మంచిగా థాంక్యూ అని రిప్లై కూడా వచ్చింది. బయట అలా ఎందుకు జరుగుతుందో నాకు అర్ధం కావ‌డం లేదు. నా జీవితంలో ప్రతిసారి కెమెరా పెట్టి ఏం జరుగుతుందో చూపించలేను. ప్రతి మెసేజ్‌ను సోషల్ మీడియాలో పెట్టలేం. నా వ్యక్తిగత జీవితం గురించి జనాలు ఏం మాట్లాడుకున్నా నాకు అవసరం, ప్రతీ విషయాన్ని పట్టించుకుని స్పందించలేను’’ అని రష్మిక ఘాటుగానే స్పందించింది.బ్యాన్ వార్త‌ల‌పై కూడా స్పందిస్తూ… ‘ఇప్పటి వరకు అయితే నన్ను ఎవరూ బ్యాన్ చేయలేదు’’ అని రష్మిక నవ్వుతూ చెప్పింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago