Coconut Flower : సాధారణంగా మనం కొబ్బరిని తరచూ ఏదో ఒక విధంగా తీసుకుంటూనే ఉంటాం. కొబ్బరి బొండాలను తాగినప్పుడు వాటిల్లో వచ్చే పచ్చి కొబ్బరిని తింటాం. అలాగే ఎండు కొబ్బరిని తురుముగా చేసి కూరల్లో వేస్తుంటాం. ఇలా మనం కొబ్బరిని ఎంతో కాలంగా ఉపయోగిస్తున్నాం. ఇక కొబ్బరికాయలను కొట్టినప్పుడు వాటిల్లో పువ్వు వస్తే అంతా మంచే జరుగుతుందని కూడా భావిస్తుంటాం. అయితే వాస్తవానికి ఆ పువ్వుతో కూడా మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కనుక ఇకపై మీరు కొబ్బరికాయలను కొట్టినప్పుడు వాటిల్లో పువ్వు వస్తే అసలు విడిచిపెట్టకండి. దాంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరిపువ్వులో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పారాసైట్ లక్షణాలు ఉంటాయి. కనుక కొబ్బరి పువ్వును తింటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లను తట్టుకునే శక్తి లభిస్తుంది. అలాగే ఈ పువ్వును తినడం వల్ల వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. కనుక కొబ్బరి పువ్వును తప్పక తినాలి. దీన్ని తింటే శరీరం దృఢంగా మారుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. కొబ్బరి పువ్వును తినడం వల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా సూర్యుని నుంచి వచ్చే కిరణాల బారి నుంచి రక్షణ లభిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలు పడకుండా, సాగిపోకుండా ఉంటుంది. అలాగే జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది.
కొబ్బరి పువ్వు ద్వారా మనకు సహజసిద్ధమైన శక్తి లభిస్తుంది. దీని వల్ల చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అలసట అనేది ఉండదు. తక్షణమే శక్తి లభిస్తుంది. శారీరక శ్రమ చేసినవారు, వ్యాయామం చేసేవారు కొబ్బరి పువ్వును తింటే కోల్పోయిన శక్తి వెంటనే తిరిగి వస్తుంది. దీంతో నీరసం, అలసట అనేవి ఉండవు. మళ్లీ చురుగ్గా పనిచేస్తారు. కొబ్బరి పువ్వును తినడం వల్ల మన జీర్ణశక్తి పెరుగుతుంది. దీని వల్ల మనం తినే ఆహారాల్లో ఉండే విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. దీని వల్ల మనకు పోషణ లభిస్తుంది. పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు.
కొబ్బరి పువ్వును తినడం వల్ల పాంక్రియాస్ ఇన్సులిన్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది. క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. కొబ్బరి పువ్వును తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. కొబ్బరి పువ్వును తినడం వల్ల కిడ్నీలు, మూత్రాశయ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఆయా భాగాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. కనుక కొబ్బరి పువ్వు ఇకపై కనిపిస్తే విడిచిపెట్టకుండా తినండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…