Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. సౌత్ తో పాటు నార్త్ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోందీ కుర్ర భామ. అయితే ఇటీవల రష్మిక ప్రవర్తన వలన ఆమె ట్రోలింగ్ బారిన పడుతుంది. హీరో రిషబ్ శెట్టిపై ఆమె చేసిన కామెంట్స్ కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. రష్మికను సౌత్ ఇండియా బ్యాన్ చేయాలంటూ కూడా రిషబ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రష్మిక తాజా ఇంటర్వ్యూలో స్పందించింది.
హీరోయిన్ అయినంత మాత్రాన అందరూ ఇష్టపడతారా? ఇక్కడ కూడా ద్వేషం ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఉంటుంది. నేను ఓ పబ్లిక్ సెలబ్రెటీని. మనం వారితోనే ఉంటాం, వారితోనే మాట్లాడుతుంటాం. ఇండస్ట్రీలో కొందరికి నా తీరు నచ్చకపోవచ్చు. నేను మాట్లాడే మాటలు, నా ఎక్స్‌ప్రెషన్స్, చేతులతో చేసే సంజ్ఞలు కూడా నచ్చి ఉండకపోవచ్చు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. కానీ కొందరికి మాత్రం నేనంటే ప్రేమ ఉండి ఉంటుంది కదా. అలాంటి వారికి నేను కృతజ్ఞురాలిని అంటూ క్లారిటీ ఇచ్చింది రష్మిక.
కిరిక్ పార్టీ సినిమాతో తనని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు, నిర్మాణ సంస్థ పేరు చెప్పకుండో సో కాల్డ్ అంటూ రష్మిక ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. పేరు చెప్పకుండా చేతివేళ్లతో ఆమె సైగ చేసి చూపించింది. అప్పటి నుంచి రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమ ఉద్దేశిస్తూ తరచూ కాంట్రవర్సల్ కామెంట్స్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో కన్నడిగుల విమర్శల పాలవుతుంది. కాగా, రష్మిక చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హిందీలో మిషన్ మజ్ను రిలీజ్ కు సిద్దంగా ఉంది. జనవరి 20న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. మరోవైపు ‘యానిమల్’లో, ‘పుష్ప ది రూల్’లో నటిస్తూ బిజీగా ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…