Balakrishna : తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య తనదైన శైలిలో సినిమాలు చేస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందాడు. అయితే బాలయ్య చాలా కోపిష్టి అని కొందరు అంటుంటే మరి కొందరు చిన్న పిల్లాడి మనస్తత్వం అని అంటుంటారు. ఒక్కోసారి ఏదైనా కార్యక్రమం కోసం బయటకు వచ్చినప్పుడు అభిమానులు, అక్కడి వాళ్లతో ప్రవర్తించే తీరు చూస్తే బాలయ్య కోపం ఏ రేంజ్‌లో ఉంటుందో అర్ధం అవుతుంది. ఒక్కోసారి అభిమానులపై ఆయన చేయి కూడా చేసుకుంటారు. అలా ఆయన చేతితో దెబ్బలు తిన్నవాళ్లు చాలామందే ఉన్నారు.
తాజాగా బాలయ్య తను నటించిన ‘వీరసింహారెడ్డి‘ మూవీ ప్రీ రిలీజ్ వేడుక కోసం ఒంగోలు వెళ్లగా అక్కడ బాలయ్యను చూసేందుకు ఒంగోలు జనాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నందమూరి ఫ్యాన్స్ భారీ ఎత్తున పాల్గొన్నారు. అయితే. భారీ జనం మధ్య నడుచుకుంటూ వస్తున్న బాలయ్యని చూసిన ఓ ఫ్యాన్ .. ఆయనను శాలువాతో సత్కరించే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అభిమాని శాలువా కప్పుతుండగా.. బాలయ్య తలపై ఉన్న కళ్ళజోడు కిందపడిపోయింది. దీంతో బాలయ్య చిరాకు పడుతూ.. అవతలికి పో.. అని విసుక్కున్నాడు. ఇది చూసి కొందరు బాలయ్య కోపం తగ్గించుకోవా అని కామెంట చేస్తున్నారు.
బాలయ్య కోపం గురించి ఆయన చేయి చేసుకోవడం గురించి ఇటీవల రచయిత సాయి మాధవ్ బుర్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలయ్య ఓ సందర్భంలో నాకు అభిమానులపై చేయిచేసుకోవడం గురించి చెప్పాడు. నాకు, అభిమానులకు మధ్య ఎవరూ ఉండకూడదు. వాళ్లు నా కుటుంబం. కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టడంలో తప్పులేదు. వాళ్లను కొడితే గిడితే నేనే కొడతా. అసలు హీరోలు బౌన్సర్లను పెట్టుకోవడం ఏంటి’’ అని అన్నారట బాలయ్య. బాలయ్య చెప్పిన సమాధానం సాయిమాధవ్‌కు చాలా నచ్చిందట. మరి ఈ విషయం ఓపెన్‌గా చెప్పొచ్చు కదా అని అంటే.. ‘నాకా అలవాటు లేదు. ఎవరేమనుకున్నా ఫర్వాలేదు’ అని బాలయ్య అన్నారట. ‘వీరసింహారెడ్డి‘ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుండగా, మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాని క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని తెరకెక్కించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…