Roja : ఏపీలో పొలిటికల్ వ్యవహారం రోజురోజుకి హీటెక్కిపోతుంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా.. మంత్రి హోదాలో మెగా బ్రదర్స్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పవన్‌కు అసలు మానవత్వం లేదు. ఎమోషన్స్ లేవు. ఆయన నా తోటి ఆర్టిస్టు అయినందుకు సిగ్గుపడుతున్నాను. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలిత లాంటి వాళ్లు తమకు గొప్ప జీవితాన్ని ఇచ్చిన ప్రజలకు సేవ చేశారు’ అన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులు తమను ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు చిన్న సహాయం చేయలేదు. అంతెందుకు వీళ్లు ముగ్గురూ సొంత జిల్లాకు ఏమీ చేయలేదు. అందుకే అన్నదమ్ముల ముగ్గురినీ సొంత నియోజకవర్గ ప్రజలే ఓడించారు. రాజకీయాల్లో ఈ ముగ్గురికి అసలు భవిష్యత్ అనేది లేదు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులతో పాటు నాగబాబు, జబర్ధస్త్ శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా తన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ హెచ్చరిస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టాడు గెటప్ శ్రీను. చిరంజీవి గారి సేవా గుణం.. దాన గుణం.. తెరిచిన పుస్తకం.. ఆయన ఒక స్ఫూర్తి.. మరి మీకెందుకు కనపడలేదో ? రోజాగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి. మీ ఉనికి కోసం.. ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీమీదున్న గౌరవాన్ని కోల్పోకండి.. మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సివస్తుందని అనుకోనేలేదు.. దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండి’ ఇట్లు చిరంజీవి అభిమాని అంటూ పోస్ట్ పెట్టాడు గెటప్ శ్రీను.
ఇక నాగబాబు.. రోజాపై నిప్పులు చెరిగారు. ‘మంత్రి రోజా.. భారతదేశ పర్యాటకశాఖ ర్యాంకింగ్స్‌లో ఉన్న 20 స్థానాల్లో కేరళ, అస్సాం, గుజరాత్‌లు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 18లో ఉంది. నువ్వు ఇలాగే బాధ్యత లేకుండా ఉంటే మరింత దిగజారి 20కి చేరుతుంది’ అని హెచ్చరించారు. ‘ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మీద ఆధారపడి కొన్ని వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఈ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ల జీవితాలు మట్టికొట్టుకుపోయాయి. నువ్విలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. కాబట్టి నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు’ అని చెప్పారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…