Rashmika Mandanna : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాక అంతట కూడా బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది.పుష్ప సినిమాకి బన్నీ నేషనల్ అవార్డ్ రావడం పట్ల ఆయనపై ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ 69 సంవత్సరాల కల నెరవేర్చిన పుష్పరాజ్ ఎక్కడా తగ్గలేదు. ఇవ్వాల్సింది కూడా దిమ్మతిరిగేలా ఇచ్చాడు. తెలుగు సినీ ప్రేక్షకులేకాదు.. తెలుగు ప్రజలందరికీ ఇది మంచి శుభ సమయం లాంటిది. 69ఏళ్ల తర్వాత.. 69 వ నేషనల్ ఫిల్మ్ అవా ర్డ్స్ లో ఉత్తమ నటుడిగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంపికయ్యారు. పుష్ప సినిమా జాతీయస్థాయిలో రెండు అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ఎంపికయ్యారు. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై యెర్నేని నవీన్, వై.రవిశంకర్ నిర్మించారు.
పుష్ప ఎప్పుడు రిలీజ్ అయిందో అప్పటి నుండే బన్నీపై ప్రశంసలు కురుస్తుంది. తన మ్యానరిజం, డ్యాన్సింగ్,యాక్షన్ అన్నీ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవారు సైతం బన్నీని పొగిడేసారు.ఇక పుష్ప చిత్రంలో కథానాయికగా నటించిన రష్మిక సైతం ఓ సందర్భంలో బన్నీని తెగ పొగిడేసింది. అద్భుతమైన నటన కనబరిచాడని, కిల్లింగ్ పర్‌ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడని చెప్పుకొచ్చింది. నేషనల్ అవార్డ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చి బన్నీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడని పేర్కొంది. రష్మిక చెప్పిన మాటలు ఇప్పుడు నిజం అయ్యాయి. ఆమె చెప్పినట్టు అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్ దక్కింది.
నేషనల్ అవార్డు ప్రకటన తర్వాత తన నియర్ అండ్ డియర్స్ , పుష్ప సినిమా బృందం అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. ఈ క్రమంలోనే చిత్ర డైరెక్టర్ రసుకుమార్ అల్లు అర్జున్ ను కౌగిలించుకొని, గట్టిగా హత్తుకొని అభినందనలు తెలియజేశారు. అయితే తన హగ్ ను ఎక్కువ సమయం అలాగే ఉంచడంతోపాటు సుకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. కళ్లమ్మట నీళ్లు కారాయి. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…