Ranbir Kapoor : బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ స్టార్ హీరోలలో ఒకరు అనే విషయం తెలిసిందే. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ ఉంటాయి. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీకి మంచి మార్కులు పడ్డాయి. యానిమల్ సినిమాలో స్కూల్ ఎపిసోడ్, అలాగే చెల్లెల్ని ర్యాగింగ్ చేస్తే రణ్‌బీర్ కపూర్ స్పందించే తీరు సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టాయి. ఇంటర్వెల్‌కు ముందు దాదాపు 20 నిమిషాల పాటు సాగే సుదీర్ఘమైన యాక్షన్ సీక్వెన్స్ దిమ్మతిరిగిపోయేలా ఉంటుంది. అలాగే ఫస్టాఫ్‌లో రష్మికతో రణ్‌బీర్ రొమాంటిక్ సీన్లు, శృంగార సన్నివేశాలు చూస్తే తట్టుకోవడం చాలా కష్టం. తండ్రి, కొడుకుల మధ్య సన్నివేశాలు, బబ్బూ పృథ్వీరాజ్‌తో ఉండే సీన్లు సినిమాకు బలంగా మారాయి.
మొదటిరోజు నుంచే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తుంది. మొదటిరోజు ఈ సినిమా రూ.116 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు ఏకంగా రూ.236 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు వరల్డ్‌వైడ్‌గా రూ.356 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం 700 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లని రాబట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా చాలా థియేటర్స్‌లో హౌజ్‌ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తుంది. ఇంకా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన రణ్‌బీర్‌కి ప్రశంసలు దక్కుతున్నాయి. ఆయన స్థానంలో మరో హీరోని ఊహించుకోలేమంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం రణ్‌బీర్ చాలా కష్టపడ్డాడు. పాత్రకి తగ్గట్టు తన బాడీని మరల్చడానికి జిమ్‌లో ఎంతో వర్కవుట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
చిత్ర కథ విషయానికి వస్తే…విజయ్ (రణబీర్‌కపూర్) నాన్న పిచ్చోడు కాగా, చిన్నప్పట్నుంచీ తండ్రి అంటే అలవిమాలిన ప్రేమ. నాన్నే అతని ఓ సూపర్‌హీరో. కానీ తండ్రి నుంచి మాత్రం అతను ఆశించిన ప్రేమ దక్కకపోయిన నాన్నంటే పిచ్చి. తన కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తుంటాడు. తనవాళ్లకు ఏమైనా చిన్న సమస్య వచ్చినా వైల్డ్‌గా రియాక్టవుతుంటాడు. ఆ కారణంచేత తండ్రి కోపానికి గురవుతుంటాడు. ఇంట్లోవాళ్లకు ఇష్టంలేని పెళ్లి చేసుకొని కుటుంబానికి దూరమైన విజయ్, కొన్నాళ్ల తర్వాత భార్యాపిల్లలతో కలిసి తన ఇంటికి చేరుకుంటాడు. అప్పడే తెలుస్తుంది అతనికి తన తండ్రి ఆపదలో ఉన్నాడని. తన తండ్రిపై జరిగిన హత్యాప్రయత్నం గురించి తెలుసుకొని, దీనికి కారణమైన వాళ్లను వెతికి చంపాలనుకుంటాడు? ఈ ప్రయత్నంలో అతనికి ఎదురైన సమస్యలేంటి? అనుకున్నది ఎలా సాధించాడు? నాన్న ప్రేమను ఎలా పొందాడు? అనేది చిత్ర కథ.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…