Pranathi Shinde : రేవంత్ ప్ర‌మాణ స్వీకారం స‌మ‌యంలో త‌ళుక్కుమ‌న్న సుంద‌రి.. ఇప్పుడంతా ఆమె గురించే చ‌ర్చ‌..!

Pranathi Shinde : తెలంగాణలో ఈ సారి కాంగ్రెస్ గాలి వీచింది. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చాక రెండు సార్లు బీఆర్ఎస్ కి ప‌ట్టం క‌ట్టిన తెలంగాణ ప్ర‌జ‌లు ఈ సారి కాంగ్రెస్ వైపు చూశారు. మంచి మెజారిటీతో కాంగ్రెస్ గెల‌వ‌గా, రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యారు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ వెనకాల కూర్చున్న ఈ అందమైన మహిళ చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించింది.రాహుల్, ప్రియాంక పై కెమెరా ఫోకస్ చేసిన ప్రతిసారి ఆమె వెనకాల నవ్వుతూ కూర్చున్న ఈ అందమైన మహిళ ఎవరు అంటూ చాలామంది సోషల్ మీడియాలో చర్చ సాగించారు. ప్రియాంక, రాహుల్‌గాంధీల వైపు టీవీ కెమెరాలు ఫోకస్‌ చేస్తాయి కాబట్టే వారి వెనుక కూర్చున్న ఆ అందమైన యువతి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇప్పటి వరకు మనమెప్పుడు చూడని ఆ యువతి ఎవరు? రాజకీయాలతో ఆమెకు ఏమిటి సంబంధం? తెలంగాణతో ఆమెకున్న అనుబంధం ఏమిటి? అధినాయకత్వానికి అంత దగ్గరి మనిషా? అన్న అనుమానాలు చాలా మందికి కలిగాయి. ఇంతకీ ఎవరామె? ఇంతకూ ఆమె ఎవరంటారా? ఆమె పేరు.. ప్రణతి షిండే. తెలంగాణ రాష్ట్రానికి పొరుగున ఉన్న మహారాష్ట్ర. ఇంతకు ఆమెకు తెలుగు రాజకీయాలకు లింకేమిటి? అన్న ప్రశ్న తలెత్తొచ్చు. అయితే.. మరిన్ని వివరాలు సేకరించినప్పుడు.. ఆమె ఈ కార్యక్రమానికి హాజరు కావటంలో అర్థం కనిపిస్తుంది. రేవంత్ ప్రమాణ స్వీకార సభలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన ప్రణతి ఎవరో కాదు.. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించటంతోపాటు.. అంతకు ముందు కేంద్ర మంత్రిగా.. కాంగ్రెస్ సీనియర్ నేతగా సుపరిచితుడైన సుశీల్ కుమార్ షిండే గారాలపట్టి.

Pranathi Shinde became center of attraction in that program
Pranathi Shinde

ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు కాగా.. వారిలో ప్రణితి ఒకరు. చిన్న కుమార్తె అయిన ఆమె తండ్రి రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. రాజకీయ వారసురాలిగా తెర మీదకు వచ్చారు. 28 ఏళ్ల చిరుప్రాయంలో ఎన్నికల బరిలోకి దిగిన ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ మహిళా నేతల్లో అత్యంత యాక్టివ్ గా ఆమెకు పేరుంది. ప్రస్తుతం మహారాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న ఆమె.. ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. పార్టీలో ఆమెకున్న స్థాయికి తగ్గట్లే.. రాహుల్.. ప్రియాంక వెనుకనే ఆమెకు చోటుదక్కింది.

దీంతో.. ఆమె కెమేరా కళ్లకు చిక్కారు. ఇక్కడ ఆమె గురించి మరో ఆసక్తికర అంశాన్ని చెప్పాలి. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సుశీల్ కుమార్ షిండే షోలాపూర్ ఎంపీగా పోటీ చేశారు. కానీ.. బీజేపీ అభ్యర్థి శ్రీసిద్ధేశ్వర్ మహారాజ్ చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి తండ్రి పరాజయానికి బదులు తీర్చుకోవాలన్న కసితో ప్రణతి ఉందని చెబుతారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే షోలా పూర్ మీద కేసీఆర్ సారు కూడా ఫోకస్ పెట్టిన వేళ.. అదే రాష్ట్రంలో తమ పార్టీ కొలువు తీరిన నేపథ్యంలో.. రేవంత్ ప్రమాణ మహోత్సవానికి హాజరైనట్లుగా చెబుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago