CM Revanth Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపచడంతో పాటు ప్రశంసల జల్లు కురిసేలా చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా ప్రజలలో మద్యం అలవాటును తగ్గించడానికి బెల్ట్ షాపులని మూసివేసే ఆలోచనని తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. తక్షణమే అన్ని గ్రామాలలో, బస్తీల్లో బెల్ట్ షాపులు మూయించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.మ ద్యం కారణంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా బెల్ట్ షాపు కారణంగా అనేక అనర్థాలు జరుగుతున్నాయి. వీటిని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటేనే ఉంటాయి.
తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుంది. అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవలే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా బెల్డ్ షాపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. బెల్ట్ షాపుల కారణంగా యువత, చిన్నారులు మద్యానికి బానిస అవుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష బెల్ట్ షాపులను నిషేధించాలని ప్లాన్ చేస్తోంది. ముందు బెల్ట్ షాపుల లెక్క తేల్చి, వాటి వల్ల దుష్ప్రరిణామాలు లేకుండా చేసేందుకు గ్రామాల్లోని ఈ లిక్కర్ దందాను బంద్ చేపించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెల్టు షాపులను మూసివేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు.
ఒక్కో గ్రామంలో 5 నుంచి 10 వరకు బెల్ట్ షాపులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉంటాయి. పలుచోట్ల ఈ బెల్ట్ షాపుల్లో నిరంతరం మద్యం విక్రయాలు జరుగుతాయి. వీటి కారణంగా యువతతో పాటు విద్యార్థులు చెడు మద్యానికి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి వాటిపై ఉక్కుపాదం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో కు పూర్తి స్థాయి డైరెక్టర్ ను నియమించడంతోపాటు ఆ విభాగం బలోపేతం చేయాలని సూచించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…