Rana Naidu : వెంకటేశ్, రానా దగ్గుబాటి కలిసి తొలిసారి నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సిరీస్ మొదట పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఇప్పుడు మాత్రం విమర్శల పాలవుతుంది.ఇప్పటివరకు ఫ్యామిలీ హీరోగా పేరున్న వెంకటేశ్ ఇందులో యథేచ్చగా బూతులు మాట్లాడడం కొందరికి నచ్చడం లేదు. దీంతో రామానాయుడుపై నెట్టింట భారీగా ట్రోల్స్ జరుగుతుంది. టాక్ ఎలా ఉన్నప్పటికీ విడుదలైన రెండు రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లోకి రామానాయుడు చేరింది. భారత్ టాప్ ట్రెండింగ్ షోల్లో ‘రానా నాయుడు’ సిరీస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నట్లు పేర్కొంది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది నెట్‌ఫ్లిక్స్. దీనిపై స్పందించిన రానా.. ‘రానా నాయుడు సిరీస్ ను విమర్శిస్తున్న, అసహ్యించుకుంటున్న వారికి క్షమాపణలు చెప్పారు. అదే సమయంలో తమ సిరీస్ కు ఇంతటి ఆదరణ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. సిరీస్‌ను కుటుంబంతో కాకుండా ప్రతి ఒక్కరూ ఒంటరిగా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సిరీస్‌కు ఓ వర్గం ప్రేక్షకులు నుంచి మిశ్రమ స్పందన వచ్చినా.. నెట్‌ఫ్లిక్స్ మాత్రం సిరీస్ ట్రెండింగ్‌లోఉండడం గమనర్హం. సుప్రన్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహించారు.
రానా నాయుడు సిరీస్ మొత్తంలో ఊహించని స్థాయిలో బూతు పదాలు వాడారని, 18 ఏండ్లు పైబడిన వారే చూడాలంటూ సిరీస్ చూసిన వారు కూడా అభిప్రాయపడుతున్నారు. అంతకముందు ప్రీమియర్ షో సమయంలో మాట్లాడిన వెంకటేశ్.. ‘ మీ ఇంట్లో ల్యాప్ ట్యాప్ లు, ఫోన్లలో దీన్ని చూస్తుంటే మీ ఫేస్ లో ఎక్స్ ప్రెషన్లు పూర్తిగా మారిపోతుంటాయి. ఎందుకంటే ఇందులో కామెడీ, హింస, సెక్స్ కూడా ఉన్నాయి’ అని చెప్పారు. ఇలా చెప్పినప్పటికీ ఈ రేంజ్‌లో అడల్డ్ కంటెంట్ ఉంటుందని జనాలు ఊహించలేకపోయారు. ప్రస్తుతానికి రానా నాయుడిపై జోరుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…