Rana Naidu : రానా, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలలో రూపొందిన వెబ్ సిరీస్ రానా నాయుడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ని అనేక వివాదాలు చుట్టు ముట్టాయి. బూతు సిరీస్ గా ముద్ర వేయించుకుంది. పరిమితికి మించి బూతులు ఉండటం.. సెక్స్ సీన్లు ఎక్కువగా ఉండటంతో.. వెంకటేష్, రానాలు తీవ్ర విమర్శలు ఎదుర్కొనడంతో నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యూవర్ షిప్ పరంగా అద్భుతంగా రెస్పాన్స్ సంపాదించిది. రానా నాయుడు వెబ్ సిరీస్ తో వెంకటేష్ తో సహా రానా తొలిసారి డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అరంగేట్రం చేశారు. ఇక ఈ సిరీస్ ఉన్న అడల్ట్ కంటెంట్ కారణంగా విపరీతమైన క్రేజ్ తో పాటు.. విమర్శలను కూడా ముట కట్టుకుంది.
వరుస విమర్శలు వస్తున్న నేపథ్యంలో రానా నాయుడు సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోను తొలగిస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఇలా తెలుగు ఆడియో తొలగించడానికి ప్రధాన కారణం బూతులు ఎక్కువగా ఉండటమే అని తెలుస్తోంది. ఇక మార్చి 10న స్ట్రీమింగ్ అయిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్స్ ఉంది. ఎక్కువ మెుత్తంలో అడల్డ్ కంటెంట్ ఉండటంతో.. నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇక ఈ సిరీస్ లో నటించినందుకు గాను విక్టరీ వెంకటేష్ దాదాపుగా రూ.12 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా సమాచారం. రానా రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన రానా నాయుడు వెబ్ సిరీస్ పాపులర్ అమెరికన్ సిరీస్ ‘రే డోనోవర్’ కు ఇండియన్ అడాప్షన్ వెర్షన్ గా నిర్మించారు. బాలీవుడ్ హాట్ బ్యూటి సుర్విన్ చావ్లా చాలాకాలం గ్యాప్ తర్వాత ఇందులో మెరిసింది.. ఇక ఆశిష్ విద్యార్థి, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఆదిత్య మీనన్, ముకుల్ చద్దా తదితరులు కీలక పాత్రలు పోషించారు. రానా నాయుడు వెబ్ సిరీస్ ను హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…