Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలి కాలంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో మనం చూశాం. చైతూతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి సమంతని చాలా కుంగదీసింది. అయితే వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతుంది. సమంత నటించిన కొత్త మూవీ శాకుంతలం. ఏప్రిల్ 14వ తేదీన ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. గుణశేఖర్ దర్శకుడు. ప్రస్తుతం ఆమె ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో తన వ్యక్తిగత జీవితం మీద మాట్లాడారు. అనేక విషయాలను బయటపెట్టారు.
అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తరువాత సినిమాల మీదే దృష్టి పెట్టిన సమంత- వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం చర్చనీయాంశమౌతోంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడంపైనా స్పందించిన ఆమె తాను తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాను కేరీర్ లో ఎప్పుడు కూడా ఐటెమ్ సాంగ్ చేయలేదని గుర్తు చేశారు. పుష్ప సినిమాలో చేసిన ఊ అంటావా.. పాట సాహిత్యం తనకు నచ్చిందని, అందువల్లే వద్దని చెప్పినా తాను ఆ పాటలో నటించానని చెప్పుకొచ్చింది. వైవాహిక బంధంలో పూర్తి నిజాయితీగా ఉన్నా అది వర్కౌట్ కాలేదని అన్నారు సమంత.
మయోసైటిస్, మెడికేషన్ కారణంగా ఆరోగ్యం కంట్రోల్ లేకుండా పోయిందని అందుకే కళ్లద్దాలు వాడుతున్నాను తప్పా ఏదో స్టైల్ కోసం కాదని.. వెలుతురిని తన కళ్లు తట్టుకోలేవని.. ఇలాంటి ఇబ్బంది ఏ నటికీ రాకూడదు అని సమంత ఆవేదన వ్యక్తం చేసింది. మంచి మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న సమంత ఏప్రిల్ 14న శాకుంతలం చిత్రంతో పలకరించనుంది.. మరోవైపు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తోంది. శివనిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…