Rana : ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన గుణశేఖర్‌కి ఈ మధ్య సక్సెస్ అనేది రావడం కష్టంగా మారింది. వరుస ఫ్లాపుల తర్వాత సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో శాకుంతలం అనే మైథలాజికల్ డ్రామా మూవీని తెరకెక్కించారు. గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణా గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ పాన్ ఇండియన్ మూవీకి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పై దిల్ రాజు సమర్పకుడుగా వ్యవహరించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీకి ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన అందుకుంది. గుణశేఖర్ తెరకెక్కించిన ఒక్కడు సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అదే రేంజ్ హిట్ అందుకోవడానికి గుణశేఖర్ కు చాలా కాలం పట్టింది.
అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రమదేవి సినిమాతో మరో హిట్ అందుకున్నారు. హిస్టారికల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కాని శాకుంతలం మాత్రం ప్రేక్షకులని అంతగా అలరించలేకపోయింది. శాకుంతలం రిజల్ట్ చూశాక హిరణ్య కశ్యప ప్రాజెక్టు ముందుకెళ్లడం సాధ్యమేనా అనే అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. శాకుంతలం చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ కార్టూన్ వర్క్ లా ఉంది అంటూ విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో వందల కోట్ల బడ్జెట్ తో హిరణ్య కశ్యప ప్రాజెక్ట్‌ని తెరకెక్కించడం సాధ్యమయ్యే పనేనా అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
రానా దగ్గుబాటిని హిరణ్య కశ్యప పాత్రలో ఎంపిక కూడా చేయగా, సురేష్ బాబు నిర్మాతగా ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ వర్క్ కూడా మొదలైంది. కానీ ఏమైందో ఏమో కానీ ఈ చిత్రం నుంచి రానా తప్పుకున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. దీంతో మూవీ పట్టాలెక్కడం కష్టమని అందరు అనుకున్నారు. కానీ గుణశేఖర్ మాత్రం ఈ చిత్రం తప్పకుండా ఉంటుంది అని.. హీరో ఎవరనేది తర్వాత డిసైడ్ అవుతుందని చెబుతూ వచ్చారు. గుణశేఖర్ ఎంతో ఆశపడి తెరకెక్కించాలనుకున్న పౌరాణిక చిత్రంపై చాలా ఏళ్లుగా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. మరి శాకుంతలం రిజల్ట్ తర్వాత ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…