Ramya Krishnan : ఆకట్టుకునే అందం, అలరించే అభినయంతో కొన్ని దశాబ్ధాలుగా ప్రేక్షకులని అలరిస్తుంది రమ్యకృష్ణ. 80వ దశకంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తనదైన నటనతో ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది. దక్షిణాది మొత్తంలోనూ ఇప్పటికీ తన హవాను చూపిస్తున్న రమ్యకృష్ణ పలు భాషలలో వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తుంది. ‘వెళ్ళై మనసు’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ.. ‘భలే మిత్రులు’ అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టారు. అప్పటి నుంచి దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి హవాను చూపించారు. తద్వారా నేషనల్ రేంజ్‌లో క్రేజ్ పొందారు. బాహుబలిలో శివగామి పాత్ర రమ్యకృష్ణకి మంచి క్రేజ్ దక్కేలా చేసింది.
రమ్యకృష్ణ ఈ మధ్య కాలంలో తెలుగులో కంటే వేరే భాషల చిత్రాలతోనే ఫుల్ బిజీగా గడుపుతున్నారు. రీసెంట్‌గా ‘రంగమార్తాండ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ఆమె భర్త డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించారు.. ఇందులో ప్రకాశ్ రాజ్, రాహుల్ సిప్లీగంజ్, శివాత్మిక తదితరలు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. అయితే ఇప్పటికీ చాలా హుషారుగా ఉండే రమ్యకృష్ణ రీసెంట్ గా సుమలత తనయుడి వెడ్డింగ్ వేడుకలో రచ్చచేసింది . సుమలత తనయుడు అభిషేక్ అంబరీష్ వివాహం కర్ణాటకలోని ఒక ప్యాలస్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి కార్యక్రమానికి సినీ రాజకీయ నాయకులు భారీగా తరలి వచ్చారు.
పెళ్లి అనంతరం జరిగిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫంక్షన్ లో యశ్ మరియు మరో స్టార్ హీరో దర్శన్ పాల్గొని సందడి చేశారు. మ్యూజికల్ నైట్ లో కొత్త జంటతో కలిసి యశ్ అండ్ దర్శన్ స్టేజి పై డాన్స్ చేసి అదరగొట్టేశారు. అదే వేడుకలో రమ్యకృష్ణ కూడా యష్, సుమలతలతో పాటు తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అలరించింది. 55 ఏళ్ల వయస్సులో రమ్యకృష్ణ ఇంత ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం పట్ల అభిమానలుఉ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పార్టీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మాజీ సీఎం యడియూరప్ప లతో పాటు చిరంజీవి దంపతులు, జాకీష్రాఫ్, ఖుష్బూ తదితరులు హాజరయ్యి కొత్త జంటను ఆశ్వీరదించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…