Pawan Kalyan : భారతీయ జనతా పార్టీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఏపీ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పర్యటించిన మరుసటి రోజే అమిత్ షా.. విశాఖపట్నానికి రావడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అమిత్ షా ప్రసంగించారు. పాకిస్తాన్‌పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ మొదలుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలనా వ్యవహారాల వరకు మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం సాధించిన విజయాలను జనం ముందుంచారు.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని అమిత్ షా ఆరోపించారు. జగన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణాల ఆరోపణలు ఉన్నాయని, వాటిపై తమకు ఫిర్యాదులు అందుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. జగన్ సాధించింది అవినీతి, కుంభకోణాలు తప్ప ఇంకేమి లేవని అన్నారు.. వాటికి చరమగీతాన్ని పలకాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. పేదలకు అందిస్తున్న బియ్యాన్ని ప్రధాని మోదీ సరఫరా చేసినవేనని, కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న బియ్యంపై జగన్ తన ఫొటో వేసుకుని ప్రచారం చేసుకుంటోన్నాడని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ ఏ ఒక్క పార్టీకో లేక బీజేపీకో చెందిన వ్యక్తి కాదని, ఆయన విశ్వ గురువు అని అమిత్ షా ప్రశంసించారు. బీజేపీకి జనసేన మిత్ర పక్షం కాగా, ఇద్దరు కలిసి ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే ఏపీకి అమిత్ షా వచ్చినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఫాలొయింగ్ గురించి కూడా తెలుసుకున్నారట అమిత్ షా. రోజురోజుకి పవన్‌కి పెరుగుతున్న ఆదరణ పట్ల అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అభిమానుల రోమాలు నిక్కపొడుచుకున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…