Ramoji Rao : తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్ శకం ముగిసింది. నవంబర్ 15న ఆయన కన్నుమూసారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయన. ఎంతో మందిని శోకసంద్రంలో ముంచుతూ ఆయన అనంతలోకాలకు వెళ్లారు. కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.అనంతరం కృష్ణ మరణించిన మూడో రోజు చిన్న కర్మ నిర్వహించారు. ఇక కృష్ణ జ్ఞాపకార్ధం కుటుంబ సభ్యులు ఓ మెమెరియల్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందులో కృష్ణగారి విగ్రహంతో పాటు ఆయన సాధించిన రికార్డులు.. ఈయన అందుకున్న సినిమాకు సంబంధించిన షీల్డులను అభిమానుల సందర్శార్ధం ఉంచనున్నారు. దీనిపై క్లారిటీ రానుంది
ఇక సూపర్ స్టార్ కృష్ణ నిదానమైన మనిషి అనే విషయం మనకు తెలిసిందే. ఆయన సెట్స్ లో చాలా జాలీగా ఉండేవారు ఆయనతో పనిచేసిన వారు చెబుతూ ఉంటారు. అయితే 1984 డిసెంబర్ లో ఊహించని ఘటన జరిగింది. నాందెండ్ల ఎపిసోడ్ ముగిసిన తరవాత ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు.ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేవారు. ఆయన ప్రసంగాలన్నీ రచయిత మహారథి రాసేవారు.
అయితే ఈనాడు పత్రిక తెలుగుదేశం పార్టీ కరపత్రిక అనే ముద్ర ఉండగా, అది కేవలం తెలుగు దేశంకి అనుకూలంగా మాత్రమే వార్తలు రాస్తుందనే అభిప్రాయం ఉండేది. 1984 డిసెంబర్ 20న నంద్యాలలో జరిగిన కృష్ణ.. ఎన్టీఆర్ ను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం తాను తిరిగి వెళ్లే క్రమంలో ఆయనపై రాళ్లదాడి జరిగింది. ఓ రాయి కృష్ణ కంటికి తగిలింది. దాంతో మరసటి రోజు కృష్ణ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి ఎన్టీఆర్ పై విమర్శలు కురిపించారు. తన పై జరిగిన దాడికి ఈనాడు, టీడీపీ భాధ్యత వహించాలని అన్నారు. ఈనాడు పత్రిక తన సభకు మూడు లక్షలకు పైగా జనాలు వస్తే కేవలం పదిహేను వందల మంది మాత్రమే వచ్చినట్టు రాసిందని అన్నారు.
ఈనాడు కండ్లు చెవులు మూసుకుపోయాయా, అసలు కాంగ్రెస్ కు ఓటు వేయవద్దని రాసే హక్కు ఈనాడుకు ఎవరు ఇచ్చారు అంటూ కృష్ణ మండిపడ్డారు. కృష్ణ చేసిన విమర్శలను ఈనాడు మరుసటి రోజు ఫ్రంట్ పేజీలో ప్రచురించగా, ఇక ఆ తరవాత నుండి కృష్ణ మరియు రామోజీరావు మధ్య మాటలు లేకుండా పోయాయి. పచ్చని సంసారం సినిమా నుంచి కృష్ణ, రామోజీరావు మళ్లీ కలిసిపోయారని సమాచారం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…