Radhika Sarathkumar : కోమలి అనే సినిమాతో తమిళంలో ఒక్కసారిగా స్టార్ అయిపోయిన డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్. ఆయన దర్శకత్వం వహించిన రెండో సినిమా లవ్ టుడే. ఈ సినిమాలో హీరో కూడా ఆయనే. ఇవానా హీరోయిన్. సత్యరాజ్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. తమిళనాడులో నవంబర్ 4న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు ప్రదీప్ రంగనాథన్, ఇవానా, నటి రాధికా శరత్‌కుమార్, నిర్మాత దిల్ రాజు, దర్శకులు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు. అది మూవీకి సంబంధించిన విషయమే అయినప్పటికీ.. ఆడియెన్స్ లో మగాళ్లందరూ ఒక్కసారి ఆశ్చర్యపోయారు. పాత సినిమాల్లో చూస్తే ఒకరినొకరు ప్రేమించుకుంటారు. నువ్వు నా జీవితం అని చెబుతారు. శోభన్ బాబు, కృష్ణ సినిమాల్లో ఇద్దరేసి భార్యలు ఉంటారు. ఇద్దరూ భర్త కోసం పూజాలు చేస్తారు. మీలాంటి భర్త దొరకడం అదృష్టమండి అంటారు. ఇప్పుడు అదంతా అబద్ధం అయిపోయింది. ఇప్పుడు ప్రేమలు మారిపోయాయి.
నిజంగా ఇక్కడ ఎవరైనా మగాడు ఉంటే.. నాకు ఒక్కరే అని చెప్పండి అని చెప్పిన రాధిక.. ఫన్నీగా సవాలు విసిరారు. వెంటనే రెస్పాండ్ అయిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. నాకు ఒక్కరే అని సమాధానమిచ్చారు. ఒక్కరే.. సైడ్ లో ఇద్దరు అని రాధిక పంచ్ వేశారు. ఒకరిని ప్రేమిస్తూ, మరొకరి గురించి అస్సలు ఆలోచించడం లేదు అనేవాళ్లు ఇప్పుడు లేరని, ఒకవేళ ఉన్నామని చెబితే అది అబద్ధమని రాధిక అన్నారు. దీంతో రాధిక వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన లవ్ టుడే.. పెళ్లికి సిద్ధమైన ప్రేమికులు, ఓ రోజంతా వాళ్ల ఫోన్లు మార్చుకుంటే ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ తో తీశారు. ఈ మూవీ తెలుగులో నవంబరు 25న రిలీజ్ కానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…