Nivetha Pethuraj : సినిమా పరిశ్రమలో సెలబ్రిటీల మధ్య ప్రేమాయణాలు కొత్త కాదు. ఎవరు ఎప్పుడు ఎలా ప్రేమలో పడతారో చెప్పడం చాలా కష్టం. కొందరు సీక్రెట్ ప్రేమాయణం నడుపుతుంటారు, మరి కొందరు పబ్లిక్‌గానే చెట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతుంటారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో యువ హీరో విశ్వక్ సేన్ మరియు హీరోయిన్ నివేదా పెతురాజ్ మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా నడుస్తుంది. ఇటీవల విడుదలైన “ధంకీ” సినిమా ట్రైలర్ చూస్తే వీరి గురించి వస్తున్న పుకార్లు అన్నీ నిజమేనేమో అని సందేహాలు వస్తున్నాయి. ఇప్పటిదాకా కేవలం నాన్ గ్లామరస్ పాత్రలలో మాత్రమే కనిపించిన నివేదా సడన్ గా “ధంకీ” సినిమాలో సరికొత్త అవతారాన్ని చూపించడంతో అభిమానులు అవాక్కయ్యారు.
సినిమా ట్రైలర్ లో విశ్వక్ మరియు నివేదా పెతురాజ్ ల మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తే వీరిద్దరూ నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారేమో అని సందేహం అందరికి కలుగుతుంది. బోల్డ్ సన్నివేశాలలో కూడా నివేదా పెతురాజ్ చాలా ఈజ్ తో నటించటంతో ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్టైంది. ఇక ఈ పుకార్లపై విశ్వక్ లేదా నివేదా పెతురాజ్ లు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి “పాగల్” అనే సినిమాలో నటించారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతంత మాత్రం గానే నిలిచింది తాజాగా ఇప్పుడు వీరిద్దరూ కలిసి “దస్ కా ధంకీ” అనే సినిమాలో కలిసి నటిస్తుండగా, ఈ సినిమాకి విశ్వక్ సేన్ స్వయంగా దర్వకత్వం వహిస్తున్నారు.
విశ్వక్, నివేదా రెండుసార్లు కలిసి నటించడం వల్ల మాత్రమే వీరిద్దరి మధ్య ఇలాంటి పుకార్లు వస్తున్నాయా లేక వీరిద్దరి మధ్య నిజంగానే ఏమైనా నడుస్తుందా అనేది మాత్రం ఇప్పటి వరకు సస్పెన్స్. విశ్వక్ ఇటీవల తమిళ సినిమా ‘ఓ మై కడవులే’ కు రీమేక్ గా ‘ఓరి దేవుడా’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చి మంచి విజయాన్నే అందుకున్నాడు. ఇక ఇటీవల విశ్వక్ సీనియర్ హీరో మరియు దర్శకుడు అర్జున సర్జా మధ్య వివాదం రాచుకున్న సంగతి తెలిసిందే. అర్జున్ దర్శకత్వంలో ఒక చిత్రానికి సైన్ చేసిన విశ్వక్.. ప్రొడక్షన్ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చి, ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో అర్జున్ తెలుగు సినిమా కౌన్సిల్ లో విశ్వక్ పై పిర్యాదు చేశాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…