Ram Charan Upasana Temple : టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ కపుల్‌గా రామ్ చరణ్, ఉపాసన పేర్లు తప్పక చెప్పాలి. ఈ ఇద్దరు పదేళ్ల క్రితం పెళ్లి అయినప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.త్వరలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో మెగా అభిమానులు ఆ గడియ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రామ్ చరణ్ అయితే తన భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. అయితే రామ్ చరణ్‌కి దైవభక్తి ఎక్కువనే విషయం అందరికి తెలిసిందే. ఆయన ఎన్నో సార్లు అయ్యప్పమాలలో దర్శనమిచ్చారు. అమెరికాకి వెళ్లే ముందు కూడా అయ్యప్ప మాలలోనే ప్రత్యక్షం అయ్యారు.
పండగ సమయంలో కూడా రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఎన్నో పూజలు చేస్తుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. దైవ చింతనలో ఉండే ఈ దంపతులకు సంబంధించి ఓ ఆసక్తిర విషయం బయటకు వచ్చింది. రామ్ చరణ్ దంపతులు ఓ చిన్న టెంపుల్ ను ఎక్కడి వెళ్లిన తమ వెంట తీసుకెళ్తుంటారు. సీతారాముల విగ్రహాలు ఉండే ఓ చిన్న టెంపుల్ ను రామ్ చరణ్ దంపతులు తప్పక తీసుకొని పోతారట. ఈ టెంపుల్ తమ వెంట ఉంటే తమకి అంతా మంచే జరుగుతుందని భావించి వారు ఎక్కడికి వెళ్లిన ఆ చిన్న గుడిని తీసుకెళతారట.
![Ram Charan Upasana Temple : రామ్ చరణ్, ఉపాసన ఎక్కడికెళ్లినా సరే చిన్న టెంపుల్‌ను తీసుకెళ్తున్నారు.. ఇంతకీ ఏంటిది..? Ram Charan Upasana Temple know what it is](http://3.0.182.119/wp-content/uploads/2023/03/ram-charan-upasana-temple.jpg)
ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా అమెరికా వెళ్లిన సమయంలో కూడా రామ్ చరణ్ దంపతులు సీతారాముల టెంపుల్ ను తమ వెంట తీసుకెళ్లారు. విదేశీయాత్రలకు వెళ్లినా, ముఖ్యమైన పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడైనా కచ్చితంగా దేవుడికి పూజలు చేస్తామని, ఆ తర్వాతే బయటకు అడుగు పెడతామని రామ్ చరణ్ స్పష్టం చేశారు. ఆస్కార్ వేడుకలో పాల్గొనడానికి వెళ్లే ముందుకు తమ హోటల్ గదిలో సీతారాముల విగ్రహాలను ఉంచి పూజలు చేశారట. దీని గురించి మాట్లాడిన చెర్రీ.. నా భార్య ఎక్కడికి వెళ్లినా తప్పకుండా ఈ చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ టెంపుల్ మన ఆచారాలనే కాదు, భారతదేశానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది” అని చరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.