Ram Charan : ఈ ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి చాలా స్పెషల్ అని చెప్పాలి. 2007లో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఆ తర్వాత ఒకే యేడాదిలో రెండు సినిమాలు మాత్రం రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాలతో పలకరించాడు చరణ్. ఈ యేడాది.. చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో గౌరవించగా, ఓ మీడియా సంస్ధ ఆర్ఆర్ఆర్‌తో ఫేమసైన రామ్ చరణ్‌ను ట్రూ లెజండ్ అవార్డుతో గౌరవించింది. ఇక తాజాగా ఇండియన్ పాపులర్ సంస్థ అయిన ఐఎండీబీ(ది ఇంటర్నెట్ మూవీడేటాబేస్) ఇండియన్ మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్ట్ ప్రకటించగా, అతనికి నాలుగో స్థానం దక్కింది.
ఏ రకంగా చూసుకున్న రామ్ చరణ్‌కి 2022 బాగానే కలిసొచ్చింది. అయితే ఏడాది పూర్తవుతుందంటే స్టార్ హీరోల పాపులారిటీ, క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఐఎండీబీ(ది ఇంటర్నెట్ మూవీడేటాబేస్) సంస్థ ఇండియన్ మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్ట్ ని ప్రకటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తెలుగు హీరోలు వెనకబడి పోగా, రామ్‌చరణ్, సమంత మాత్రం ముందు వరుసలో ఉండటం విశేషం. మొదటి స్థానంలో ధనుష్ ఉండగా, రెండో స్థానంలో `ఆర్ఆర్ఆర్` బ్యూటీ అలియాభట్, మూడో స్థానంలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ నిలిచారు. నాల్గో స్థానం `ఆర్‌ఆర్‌ఆర్` స్టార్ రామ్‌చరణ్ కి దక్కింది,. ఐదో స్థానంలో సమంత నిలవడం విశేషం. ఆరో స్థానంలో హృతిక్ రోషన్, ఏడో స్థానంలో కియారా అద్వానీ నిలవగా, ఎనిమిదో స్థానాన్ని ఎన్టీఆర్, తొమ్మిదో స్థానాన్ని అల్లు అర్జున్ దక్కించుకున్నారు.
ఇక `కేజీఎఫ్` స్టార్ యష్ పదో స్థానానికే పరిమితమయ్యాయి. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ లతో పాటు విజయ్, సూర్య వంటి పేర్లు కూడా ఈ జాబితాలో లేకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. అయితే బాలీవుడ్ నుంచి ఒక్క హృతిక్ పేరే ఉండటం కూడా షాకింగ్‌గా ఉంది. ఒకప్పుడు టాప్ 10లో ఎక్కువగా బాలీవుడ్ సెలబ్స్ పేర్లు మాత్రమే ఉండేవి. కాని ఇప్పుడు మన సౌత్ హీరోలు వాటికి చెక్ పెట్టారు. ధనుష్ ఈ ఏడాది ఇంటర్నేషనల్ మూవీ `ది గ్రే మ్యాన్`లో మెరరవడంతో పాటు `మారన్`తో అలరించగా, విడాకుల విషయంతోను హాట్ టాపిక్ అయ్యాడు. మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్`, `గంగూబాయి కథియవాడి` చిత్రాలతో ఆకట్టుకున్న అలియాభట్ ఈ ఏడాదే తల్లిగా ప్రమోషన్ అందుకున్న విషయం తెలిసిందే.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…