Baahubali 2 : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన చిత్రం బాహుబలి. రెండు పార్ట్‌లుగా తెరకెక్కిన ఈ చిత్రం అనేక సంచలనాలు క్రియేట్ చేసింది. ప్రభాస్ ద్విపాత్రాభినయం, రానా, అనుష్క మరియు తమన్నా ముఖ్య పాత్రలతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా, ఈ సినిమాలు కలెక్షన్ల పరంగా ప్రపంచ వ్యాప్తంగా సునామీ సృష్టించాయి.ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారగా, రాజమౌళి మోస్ట్ పాపులర్ డైరెక్టర్ అయ్యాడు. కలెక్షన్ ల పరంగా అదరగొట్టిన ఈ సినిమాపై బాహుబలి పార్ట్ – 3 కూడా రానుందని కొన్ని సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాధేశ్యామ్ ప్రమోషన్ లలో భాగంగా ప్రభాస్ స్పందిస్తూ.. “బాహుబలి పార్ట్-3 గురించి నాకు కూడా ఎలాంటి వార్త లేదు.. కానీ టైం వస్తే జరగొచ్చు” అని హింట్ ఇచ్ఛేసరికి ఈ సినిమా తప్పక ఉంటుందని అందరు అనుకున్నారు. రాజమౌళి కూడా పలు సందర్భాలలో బాహుబలి 3పై ఇన్‌డైరెక్ట్‌గా ప్రస్తావించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో బాహుబలి సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ బాహుబలి పార్ట్ 3 కూడా ఉంటుందని , కాకపోతే ఇంకా సమయం పడుతుందని చెప్పారు. తాజాగా మరోసారి బాహుబలి 3 గురించి చర్చ నడుస్తుంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మూవీ మారథాన్ జరుగుతుండగా, ఈ ఈవెంట్ లో రాజమౌళి సినిమాలను కూడా ప్రదర్శిస్తున్నారు.
ఈ క్రమంలో రాజమౌళికి క్యూ అండ్ ఏ లో పాల్గొన్నారట. అప్పుడు బాహుబలి 3కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ క్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఒకే ఒక సినిమా క్లైమాక్స్ ను ఓపెన్ ఎండ్ గా సంభాషణను పెట్టినట్టు చెప్పారు. అలా బాహుబలి సినిమాలో క్లైమాక్స్ లోనే తనికెళ్ల భరణి మరియు చిన్నారి మధ్య జరగగా, అప్పుడు స్వామీజీ వేషంలో ఉన్న తనికెళ్ల భరణితో చిన్నారి మహేంద్ర బాహుబలి కొడుకు రాజు అయ్యాడు తాతా అని అడుగుతుంది. దానికి తనికెళ్లభరణి.. ఏమో శివయ్య మనసులో ఏమనుకుంటాడో నాకేటి ఎరుక.. అంటూ సమాధానం ఇస్తాడు. అంటే దీనిని బట్టి రాజమౌళి అప్పుడే బాహుబలి 3పై హింట్ ఇచ్చాడ అని చర్చ మొదలు పెట్టారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…