Ram Charan : చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ అంచెలంచెలుగా ఎదుగుతూ వెళుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రామ్ చరణ్ ఇటు పర్సనల్ లైఫ్ అటు ప్రొఫెషనల్ లైఫ్‌ని చక్కగా మేనేజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. 2012 జూన్ 14న రామ్ చరణ్-ఉపాసనల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ రీసెంట్ గా ఈ జంట తమ పదో వార్షికోత్సవాన్ని గ్రాండ్‌గా జరుపుకున్నారు.
![Ram Charan : రామ్‌చరణ్ అసలు వెంకటేష్ అల్లుడు కావల్సిందట.. కానీ ఉపసానను చేసుకున్నాడు.. అసలు కథ ఇదీ..! Ram Charan should have been venkatesh son in law](http://3.0.182.119/wp-content/uploads/2022/09/ram-charan.jpg)
ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఉపాసనని వివాహం చేసుకోకపోయి ఉంటే వెంకటేష్ అల్లుడు అయి ఉండేవాడని కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. చిరంజీవి, వెంకటేష్ స్నేహితులు కాగా.. అప్పట్లో వీరిద్దరు వియ్యంకులు కూడా కావాలని అనుకున్నారట. రామ్ చరణ్ పెళ్లిని మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితతో చేయాలనుకున్నారు. కానీ చరణ్ మాత్రం అప్పటికే తాను ఉపాసనతో ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టాడు. ఆ తర్వాత చిరు.. రామ్ చరణ్, ఉపాసనల పెళ్లిని గ్రాండ్‌గా కళ్లు చెదిరిలా చేయించాడు.
ఇక ఆశ్రిత హైదరాబాద్ కి చెందిన బిజినెస్ మాన్ ని ప్రేమించి వివాహం చేసుకోగా ప్రస్తుతం భర్తతో పాటు విదేశాల్లో ఉంటుంది. మెగా కోడలు ఉపాసన విషయానికి వస్తే.. ఉమెన్ పవర్ చాటిచెప్పేలా ఉపాసన అన్ని విషయాల్లో ముందుంటున్నారు. మహిళా వ్యాపారవేత్తగా సత్తా చాటుతూ పవర్‌ఫుల్ ఉమెన్ అనిపించుకుంటున్నారు. ఇదే విషయమై ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు లభించింది. అపోలో చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే పలు సామజిక అంశాలపై రియాక్ట్ అవుతూ ఉండటం, నలుగురికీ సహాయపడే పనులు చేస్తుండటం ఉపాసన నైజం.