Samantha Naga Chaitanya : సమంత- నాగ చైతన్య జంట గత ఏడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకోగా ఈ జంట విడిపోయి దాదాపు ఏడాది కావొస్తుంది. అయినప్పటికీ ఈ జంటకి సంబంధించి ఎన్నో వార్తలు హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. అంతేకాదు వీరు ఏదైనా ఇంటర్యూలకు వెళ్లినప్పుడు వారి విడాకులకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా బ్రహ్మస్త్ర చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాగార్జున.. సమంత, నాగ చైతన్యల విడాకులకి సంబంధించిన ప్రశ్నలకు ఓపెన్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
![Samantha Naga Chaitanya : సమంత వెళ్లిపోవడం దురదృష్టకరం.. నాగార్జున షాకింగ్ కామెంట్స్.. nagarjuna first time response on Samantha Naga Chaitanya divorce](http://3.0.182.119/wp-content/uploads/2022/09/samantha-naga-chaitanya.jpg)
ఓ బాలీవుడ్ రిపోర్టర్.. నాగార్జునతో మాట్లాడుతూ.. నాగ చైతన్య ప్రొఫెషనల్ లైఫ్ కన్నా కూడా వ్యక్తిగత జీవితమే ఎక్కువ హైలైట్ అవుతుంది. ఇది మీకు ఎలాంటి బాధను కలిగిస్తుందని అన్నాడు. దానికి స్పందించిన నాగార్జున.. నాగ చైతన్య ప్రస్తుతం సంతోషంగానే ఉన్నాడు. అతను హ్యాపీగా ఉంటే మేం హ్యాపీనే. దురదృష్టవశాత్తు నాగ చైతన్య జీవితంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఇది ఒక అనుభవం. తాను వెళ్లిపోయింది, మేం ఆలోచిస్తూ కూర్చోలేము. అది జరిగిపోయింది. ఇక దాని నుండి బయటపడేందుకు ప్రయత్నించాలి.. అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు.
అక్కినేని వారసుడిగా టాలీవుడ్ గడపతొక్కి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు నాగ చైతన్య. తండ్రికి తగ్గ కొడుకుగా డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందాడు. ఇటీవల థ్యాంక్యూ చిత్రంతో దారుణమైన ఫ్లాప్ మూటగట్టుకున్న నాగ చైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇక సమంత యశోద, శాకుంతలం లాంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులని పలకరించబోతోంది. వీరు తమ తమ కెరియర్‌లలో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు.