Shivathmika Rajashekar : రాజశేఖర్, జీవితల ముద్దుల కూతురు శివాత్మిక ఇటీవల స్టార్ హీరోయిన్స్‌కి సవాల్ విసురుతున్న విషయం తెలిసిందే. సినిమాల సంగతి పక్కన పెడితే గ్లామర్ షోతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ టైట్‌ఫిట్ డ్రెస్‌లో క్రేజీ ఫొటో షూట్ చేసింది. శివాత్మిక క్యూట్ లుక్స్ చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. అమ్మడిలో ఇంత అందం దాగి ఉందా అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. బ్లాక్ టైట్ ఫిట్ లో స్కిన్ షో చేసిన శివాత్మిక నెట్టింట మంటలు పుట్టించిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ అమ్మడి పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
దొరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేదు. ప్రస్తుతం కృష్ణ వంశీ డైరక్షన్ లో వస్తున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తుంది శివాత్మిక. పంచతంత్రం అనే సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. అయితే సినిమాలతో సంబంధం లేకుండా అమ్మడు ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. స్టార్ డాటర్ ఎక్స్ పోజ్ చేస్తే ఫ్యాన్స్ ఏమనుకుంటారో అన్న మొహమాటాలు ఏమీ లేకుండా శివాత్మిక తన గ్లామర్ డోస్ రోజు రోజుకీ పెంచేస్తుంది.
స్టార్ హీరోయిన్ అయ్యేందుకు అందాల డోస్ పెంచాలని భావించిన శివాత్మిక ఇలా అందాల ఆరబోతతో నానా హంగామా చేస్తుంది. రాజశేఖర్ పెద్ద కూతురు శివాని మాత్రం గ్లామర్ విషయంలో ఆమడదూరం అన్నట్టు ఉంటుంటే శివాత్మిక మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతూ తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది. శివాత్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటిపోయింది. ఆమె డెబ్యూ మూవీ దొరసాని 2019లో విడుదలైంది. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక మంచి నటన కనబరిచింది.