Ram Charan : రామ్ చరణ్ సతీమణి ఉపాసన జూన్ 20న ఓ పండంటి బిడ్డకు జన్మను ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 23 మధ్యాహ్నం హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్బంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమకు పుట్టిన బిడ్డను మీడియాకు చూపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మెగా ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ ఆనంద సమయం వచ్చేసిందని, నిజానికి ఉపాసన తో పాటు తన ఆనందాన్ని కూడా మాటల్లో వర్ణించలేమని అన్నారు చరణ్. మాకు అందరి నుండి లభించిన బ్లెసింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని, అలానే ప్రత్యేకంగా మీడియా వారికి కూడా కృతజ్ఞతలు చెప్పారు చరణ్. కాగా రామ్ చరణ్ ఆనందంతో మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక రామ్ చరణ్ తన ఇంట్లో కూతురితో సరదాగా గడుపుతున్నారు. ప్రస్తుతం షూటింగ్‌కి కూడా దూరంగా ఉన్న ఆయన కూతురితో సరదాగా గడుపుతున్నాడు.జూలై నుండి ఆయన సెట్స్ లో అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని వేరే సినిమా చేయనున్నాడట. పుట్టిన బిడ్డకు ఆల్రెడీ ఓ పేరు డిసైడ్ చేసాము.. 21వ రోజు.. అధికారికంగా మీడియాకు తెలియజేస్తామంటూ తెలిపారు. ఈ సందర్బంగా మా కుటుంబం పట్ల ఇంత ఆదరణ చూపుతోన్న అభిమానులకు , మీడియా మిత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు రామ్ చరణ్.
బిడ్డను అఫీషియల్‌గా చూపించినా.. ముఖాన్ని మాత్రం చూపించలేదు. అయితే రామ్ చరణ్, ఉపాసన దంపతుల పుట్టిన పాపకు తాతయ్య మెగాస్టార్ చిరంజీవి పోలికలు ఉన్నట్టు చూసినవాళ్లు చెబుతున్నారు.మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబారాన్ని అంటాయి .పెళ్లైన 11 యేళ్లకు పుట్టిన బిడ్డ కావడంతో రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు మెగా కుంటుంబంలో ఆనందం వెల్లి వెరిస్తోంది. అటు మెగా ఫ్యామిలీ అభిమానులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన రామ్ చరణ్, ఉపాసనకు స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు.