Pawan Kalyan : వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. వైసీపీ నాయకలని విమర్శిస్తూ పవన్ మాటల తూటలు పేలుస్తున్నారు. వారాహి యాత్రంతా కుల, మతాల ప్రస్తావనతోనే సాగిస్తున్న పవన్ కళ్యాణ్ కోనసీమ యాత్రలో గెలుపోటముల గురించి ప్రస్తావించారు. ఇక అమలాపురం నుంచి మలికిపురం మండలం దిండి వరకు రోడ్‌షో నిర్వహించారు. ఆయన వెంట పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివెళ్లారు. దారి పొడవునా మహిళలు, యువత, చిన్నారులు పెద్దఎత్తున పవన్‌కి స్వాగతం పలికారు. ఫలితంగా రహదారులన్నీ జనాలతో కళకళాడాయి.
‘‘ఒకటే లక్ష్యం. అరాచకం ఆగాలి.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. జనం బాగుపడాలంటే జగన్ పోవాలి’’ అంటూ పవన్ తన ర్యాలీని కొనసాగించారు.. ‘హలో ఏపీ.. బైబై వైసీపీ’ అంటూ గట్టిగా నినాదాలు చేయించారు. శుక్రవారం అమలాపురం కార్యకర్తలు, నాయకుల సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్… కోనసీమ నీరు, తిండి, గాలిలో పౌరుషం ఉంటుందన్నారు. ఈ నేలలో బడబాగ్ని దాగి ఉందన్న ఆయన… అన్యాయం, తప్పు జరిగితే ఊరుకునే తత్వం ఉండదన్నారు. మనుషుల్ని ఇక్కడి వారు ఎంతగా ప్రేమిస్తారో, అభిమానం ఎంతగా చూపుతారో, వారి కోపం కూడా అంతే తీవ్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
![Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నోట బూమ్ బూమ్ బీర్ మాట.. అది తాగే చాలా మంది చచ్చిపోతున్నారంటూ కామెంట్.. Pawan Kalyan said about rakesh master death](http://3.0.182.119/wp-content/uploads/2023/06/pawan-kalyan-1-5.jpg)
మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎదుటి వారి హక్కులకు భంగం కలగనీయకుండా మన హక్కులు కాపాడుకోవాలి ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కఠినంగా ఉండే చట్టాలు అవసరం. సమాజంలోని ప్రతి ఒక్కరికి సమాన న్యాయం ఉండాలి అన్నది జనసేన లక్ష్యం” అని పవన్ స్పష్టం చేశారు. మద్యపానం నిషేదిస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు బూమ్ బూమ్ బీర్లని తెచ్చాడు. బయట లేబుల్ ఒకటి లోపల ఒకటి. అది తాగడం వలన చాలా మంది కన్నుమూసారు. మద్యపానం నిషేదిస్తామని చెప్పి ఇప్పుడు దాంతోనే కోట్లు రాబడుతున్నాడని పవన్ నిప్పులు చెరిగారు. పవన్ వ్యాఖ్యలతో రాకేష్ మాస్టర్ కూడా బూమ్ బూమ్ బీర్ తాగి కన్నుమూసారని కొందరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు.