Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చాక ఆయనపై ప్రత్యర్ధులు విమర్శలు గుప్పిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. పవన్ కల్యాణ్ విమర్శలపై తాజాగా ప్రముఖ నటుడు, ఏపీ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి స్పందించారు. పవన్‌ను తాను సినిమా ఆర్టిస్ట్‌గానే చూస్తోన్నానని అన్నారు. సినిమా ఆర్టిస్ట్‌ను చూడటానికి ప్రజలు ఆయన సభలకు వెళ్తోన్నారని, అంతకంటే ఇంకేమీ లేదని అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచిన తన సొంత కాపు సామాజిక వర్గాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు విమర్శిస్తోన్నారో అర్థం కావట్లేదని చెప్పారు. ముద్రగడ గొప్ప లీడర్ అని.. ఆయన ఏ రోజు రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందలేదని అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ నీచంగా మాట్లాడం దారుణం అంటూ మండిపడ్డారు. పవన్ వెంటనే ముద్రగడకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ముద్రగడ ఎనాడైనా తప్పు చేసినట్లు పవన్ నిరూపించలగలరా? అంటూ ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ తప్పు చేస్తున్నావ్ అంటూ హెచ్చరించారు. పవన్ వల్లే కాపుల్లో చిచ్చు మొదలైందన్నారు. కమ్మ కులంలో పుట్టిన తనే కాపు కులానికి.. కాపు నాయకులను గౌరవం ఇస్తానని.. అలాంటిది కాపు కులంలో పుట్టిన పవన్ వారికి మర్యాద ఇవ్వకపోవడం దారుణం అన్నారు. కాపుల్ని తిడుతూ నువ్వే వారిని దూరం చేసుకుంటున్నావని హెచ్చరించారు. చంద్రబాబు ఏ రోజు తన వర్గం నేతలను తిట్టలేదని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ కాపులను తిట్టి చంద్రబాబును పొగడ్డమేంటని ప్రశ్నించారు.
![Posani Krishna Murali : పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చిన పోసాని.. ఏమన్నారంటే..? Posani Krishna Murali given counter to pawan kalyan](http://3.0.182.119/wp-content/uploads/2023/06/posani-krishna-murali.jpg)
తన సొంత సామాజిక వర్గాన్ని బెదిరించడం, వారిని విమర్శించడం పవన్ కల్యాణ్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. తన కులాన్ని తానే తిడుతున్నాడని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం.. ఆయన వేసిన స్కెచ్‌కు అనుగుణంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు కూడా గతంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ఇలాంటి ప్రకటనలు చేయలేదని గుర్తు చేశారు. తాను పార్టీని పెట్టింది వైఎస్సార్‌ను ఓడించడానికి కాదు, నేను గెలవడానికేనంటూ చెప్పారని పేర్కొన్నారు. పవన్ ఒకప్పుడు మంచోడేనని, ఇప్పుడిలా పిచ్చివాడిలా ఎందుకు తయారయ్యాడో తెలియట్లేదని అన్నారు.