Ram Charan Daughter : ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా రామ్ చరణ్ కూతురి గురించే చర్చ. పెళ్లైన పదకొండేళ్ల తర్వాత రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కావడంతో ప్రతి ఒక్కరు కూడా వారి బిడ్డ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాప ఎవరి పోలికలతో పుట్టింది. ఆమె జాతకం ఏంటి, ఏ పేరు పెట్టబోతున్నారు అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది. ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ మెగా ప్రిన్సెస్ కు వెల్కమ్ చెప్పారు. అల్లు అర్జున్ కూడా తన కోడల్ని చూడటానికి స్నేహ రెడ్డితో కలిసి వెళ్లాడు.
అయితే ఇప్పుడు రామ్ చరణ్ కూతురి జాతకం గురించి పెద్ద చర్చ నడుస్తుంది. ప్రముఖుల జ్యోతిష్యాల గురించి చెబుతూ ఎక్కువగా వార్తలలో నిలిచే వేణు స్వామి మెగా మనవరాలి జాతకం ఎలా ఉండబోతుందో వీడియో విడుదల చేశారు. . ‘కొణిదెల వంశంలోకి లక్ష్మీదేవి వచ్చిందనేది హాట్ టాపిక్ అవుతోంది. కాబట్టి.. రామ్ చరణ్-ఉపాసనలకు పుట్టిన చిన్నారి జాతకం ఎలా ఉందో చూద్దాం. అమ్మాయి పుట్టింది. మంగళవారం తెల్లవారు జామున 1. 46 నిమిషాలకు. పునర్వసు నక్షత్రం రెండవ పాదము. మిథున రాశి.. జన్మనామం కోణంగి. ఈ ముగ్గురు (రామ్ చరణ్, ఉపాపన, చిన్నారి) నక్షత్రాలు చూసుకుంటే రామ్ చరణ్‌ది రోహిణి. ఉపాసన గారిది కృతికా నక్షత్రం.. అలాగే వారికి పుట్టిన పాపది పునర్వసు నక్షత్రం.
వీళ్ల వంశానికి సంబంధించి చూస్తే.. రామ్ చరణ్‌ది కృష్ణుడి నక్షత్రం. ఇప్పుడు పుట్టిన పాపది రాముడి నక్షత్రం. అలాగే ఉపాసన గారిది అమ్మ వారి నక్షత్రం. ఈ మూడు నక్షత్రాలు దేవతా అంశం కలిగినవే. చిన్నారి జాతకం ఎలా ఉండబోతుందంటే.. రాజయోగం స్పష్ఠంగా కనిపిస్తుంది. గురు ఛండాల యోగం అనేది ఉంది. చిరంజీవి గారికి ఉన్న యోగమే పాపకి కూడా ఉంది. ఈ అమ్మాయి జాతకం వల్ల కొణిదెల వంశానికి రాజయోగం ఉండబోతుంది. చిరంజీవి, సురేఖ, ఉపాసన, రామ్ చరణ్, పాప.. ఈ ఐదుగురి గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఈ ఐదుగురి జాతకంలో రాజయోగం ఉంది. రాబోయే కాలంలో ఈ పుట్టిన బిడ్డ చరిత్ర సృష్టించబోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని వేణు స్వామి స్పష్టం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…