Niharika Konidela : మీడియా నుండి త‌ప్పించుకొని మెల్ల‌గా జారుకున్న నిహారిక‌..!

Niharika Konidela : మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక ఇటీవ‌ల ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. అందుకు కార‌ణం పెళ్లైన కొన్ని సంవ‌త్స‌రాల‌కే విడాకులు తీసుకోవ‌డం. నిహారిక భర్త వెంకట చైతన్యతో ఆమె విడిపోయారు. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ తాజా పరిస్థితులతో ఒక క్లారిటీ వచ్చింది. సోష‌ల్ మీడియాలో జొన్న‌ల‌గ‌డ్డ పెళ్లి ఫొటోల‌ని డిలీట్ చేయ‌డం, క‌లిసి క‌నిపించ‌క‌పోవ‌డం, ఇటీవల నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం వేడుక జరగ‌గా ఆ ఈవెంట్‌లోను నిహారిక సోలోగా క‌నిపించ‌డంతో ఆమె త‌న భ‌ర్త‌కి విడాకులు ఇచ్చింద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు.

2023 మార్చి నెలలో వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు తొలగించాడు. కొద్దిరోజుల అనంతరం నిహారిక కూడా భర్త జ్ఞాపకాలు చెరిపేసింది. అక్కడ మొదలైన విడాకుల పుకార్లకు ఒక స్పష్టత వచ్చింది. గత కొద్ది రోజులుగా నిహారికకు తన భర్త చైతన్యతో తరచూ గొడవలు అవుతున్నాయని అందుకే వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. పలు సినిమాలు చేసింది కానీ ఏవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. తర్వాత చైతన్యని పెళ్లి చేసుకుంది. హీరోయిన్ గా సినిమాలు చేయకపోయినా సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. ఆ సంస్థ‌లో చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ నిర్మిస్తుంది. ఇప్పటికే నీహారిక ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన కొన్ని వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Niharika Konidela slowly escaped from hospital
Niharika Konidela

రీసెంట్‌గా నిహారిక అపోలో ఆసుప‌త్రిలో మెరిసింది. రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న పండంటి కూతురికి జ‌న్మ‌నివ్వ‌గా, ఆచిన్నారిని చూసేందుకు ప‌లువురు సెల‌బ్రిటీలు ఆసుప‌త్రికి వెళ్లారు. ఉపాస‌న కూడా అపోలోలో ప్ర‌త్య‌క్ష‌మైంది. అయితే ఎక్క‌డ మీడియా వాళ్లు మ‌ళ్లీ త‌న భ‌ర్త గురించి ప్రశ్నిస్తారోన‌ని నిహారిక మెల్ల‌గా జారుకుంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago